Asia Cup 2022: ఆసియా కప్ 2022లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్స్ వీరే.. విరాట్ కోహ్లీకి అత్యంత ప్రత్యేకమైనది!

Virat Kohli to Wanindu Hasaranga: Here is Asia Cup 2022 Hit Players List. ఆసియా కప్ 2022లో 5 మంది ఆటగాళ్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. వారు ఎవరో ఓసారి చూద్దాం.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 12, 2022, 10:59 AM IST
  • ఆసియా కప్ 2022లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్స్
  • విరాట్ కోహ్లీకి అత్యంత ప్రత్యేకమైనది
  • పాకిస్థాన్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌
Asia Cup 2022: ఆసియా కప్ 2022లో చెలరేగిన ఐదుగురు ప్లేయర్స్ వీరే.. విరాట్ కోహ్లీకి అత్యంత ప్రత్యేకమైనది!

Virat Kohli to Wanindu Hasaranga: Here is Asia Cup 2022 Hit Players List: ఆసియా కప్ 2022 టోర్నీ ముగిసింది. శ్రీలంక వరుసగా 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం పాకిస్థాన్‌పై శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించి ఆరోసారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ 2022 దృష్ట్యా ఈ టోర్నమెంట్ అన్ని జట్లకు చాలా ముఖ్యమైనది. మెగా టోర్నీకి ముందు జట్ల బలాబలాలు ఏంటో తెలిసొచ్చింది. ఇక ఆసియా కప్ 2022లో 5 మంది ఆటగాళ్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. ఈ ఐదుగురు టోర్నీ ఆద్యంతం తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. వారు ఎవరో ఓసారి చూద్దాం. 

విరాట్ కోహ్లీ:
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఆసియా కప్‌ 2022 అత్యంత ప్రత్యేకమైనది. ఈ టోర్నీ ద్వారా కోహ్లీ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.   ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ 2022లో అన్ని జట్లకు పెద్ద ముప్పుగా మారాడు. విరాట్ 2022 ఆసియా కప్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 92.00 సగటుతో 276 పరుగులు చేశాడు. ఆసియా కప్‌ 2022లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. 

మహ్మద్ రిజ్వాన్:
ఆసియా కప్‌ 2022లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా పాకిస్థాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ నిలిచాడు. రిజ్వాన్ 6 ఇన్నింగ్స్‌ల్లో 56.20 సగటుతో 281 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌కు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు.

భువనేశ్వర్ కుమార్‌:
టీమిండియా సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌కు కూడా ఆసియా కప్‌ 2022 అద్భుతంగా మారింది. 2022 ఆసియా కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా భువీ నిలిచాడు. 5 మ్యాచ్‌ల్లో 6.05 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు.

వానిందు హసరంగ:
2022 ఆసియా కప్‌లో శ్రీలంక స్టార్ ప్లేయర్ వానిందు హసరంగ 'మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్‌'గా ఎంపికయ్యాడు. హసరంగ బంతి మరియు బ్యాట్‌తో రెచ్చిపోయాడు. ఈ ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్‌ 2022లో అన్ని జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. హసరంగ 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీశాడు.

మహ్మద్ నవాజ్:
ఆసియా కప్ 2022లో పాకిస్థాన్ ఆటగాడు మహ్మద్ నవాజ్ బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. 6 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. అదే సమయంలో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Also Read: టీ20 ప్రపంచకప్‌కు ముందు బీసీసీఐ కీలక నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా శిఖర్ ధావన్!

Also Read: బంగారం ప్రియులకు ఊరట.. పరుగులు తీస్తున్న పసిడి ధరలకు బ్రేక్! భారీగా తగ్గిన వెండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News