Diwali 2022: దీపావళి 2022 ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి..

Diwali 2022 Date: ఈ ఏడాది దీపావళి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 13, 2022, 12:33 PM IST
Diwali 2022: దీపావళి 2022 ఎప్పుడు? శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి..

Diwali 2022 Date: హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలో దీపావళి ఒకటి.  దీపావళి రోజునే లంకాపతి రావణుడిని సంహరించి...శ్రీరాముడు వనవాసం ముగించుకుని అయోద్యకు తిరిగి వచ్చాడని నమ్ముతారు. ఈ రోజున దీపాలు వెలిగించి.. లక్ష్మీదేవి, గణేశుడిని పూజిస్తారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజు వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్ధశి. దీన్ని నరక చతుర్దశి అని పిలుస్తారు. నరకాసురుడి సంహారానికి గుర్తుగా ఈ నరక చతుర్దశిని జరుపుకుంటారు. హిందువులతోపాటు ముఖ్యంగా బౌద్ధ, జైన, సిక్కు మతాలకు చెందినవారు ఈ ఫెస్టివల్ ను చేసుకుంటారు. 

ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 24న వస్తుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించి.. అనంతరం బాణాసంచా కాల్చుతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు వంటివి కాలుస్తారు. దీపావళి శుభ ముహూర్తం, పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసుకోండి. 

దీపావళి శుభ ముహూర్తం ఎప్పుడు?
ఈ సంవత్సరం అమావాస్య తిథి అక్టోబరు 24, 25 తేదీల్లో వస్తుంది. అక్టోబర్ 25న ప్రదోష కాలానికి ముందు అమావాస్య తిథి ముగుస్తుంది. అమావాస్య తిథి ప్రదోష కాలంలో అక్టోబర్ 24న ఉంటుంది. అందుకే దేశవ్యాప్తంగా దీపావళిని అక్టోబర్ 24న జరుపుకోనున్నారు. అక్టోబర్ 24న అమావాస్య సాయంత్రం 5:28 గంటలకు ప్రారంభమై.. మంగళవారం సాయంత్రం 4.19 వరకు ఉంటుంది. అక్టోబరు 24న దీపావళి రోజున సాయంత్రం 6.54 నుండి 8.18 గంటల వరకు లక్ష్మీదేవి మరియు గణేశుని పూజించే శుభ సమయం. 

దీపావళి పూజ విధానం
దీపావళి రోజున లక్ష్మీదేవిని, గణేశుని నిష్టతో పూజిస్తే సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలుగుతాయి. దీపావళి రోజున పూజ గదిని శుభ్రం చేసి లక్ష్మీదేవి, గణేశుడి విగ్రహాన్ని పెట్టి పూజించండి. నీరు, అక్షతం, బెల్లం, పండ్లు మరియు పసుపు సమర్పించండి. 

Also Read: Indira Ekadashi 2022: ఇందిర ఏకాదశి వ్రతం ఎప్పుడు? ఈ వ్రత విశిష్టత ఏంటి? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News