Horoscope Today 14 September 2022: ఆ రాశుల వారికి సంధికాలం.. వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు!

Today Astrological prediction for 14 September 2022. సింహం, మకరం రాశుల వారికి నేడు సంధికాలం నడుస్తోంది. ఈ రెండు రాశుల వారి వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 14, 2022, 07:15 AM IST
  • 14 September 2022 రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
  • ఆ రాశుల వారికి ఏదీ కలిసిరాదు
Horoscope Today 14 September 2022: ఆ రాశుల వారికి సంధికాలం.. వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు!

Horoscope Today 14 September 2022: మేషం (Aries): శుభకాలం. సొంత వ్యవహాహారాలు ఫలిస్తాయి. ఒక వార్త మీ కుటుంబంలో ఆనందాన్ని ఇస్తుంది. ధనం వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్త. సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది. 

వృషభం (Taurus): శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని పనులు ఇప్పుడు ఇబ్బందులకు గురిచేస్తాయి. కీలక పనులలో పెద్దల నిర్ణయాలు చాలా అవసరం. గోసేవ చేయడం మంచిది. 

మిథునం (Gemini): ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్థిర నిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది.

కర్కాటకం (Cancer): శుభకాలం నడుస్తోంది. ఓ మంచి వార్త వింటారు. అన్ని రంగాలవారికి సానుకూల పరిస్థితులు. అధిక ధన లాభం ఉంది. వివాదాలకు దూరంగా ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం మంచిది. 

సింహం (Leo): మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు. బలమైన ప్రయత్నాలు మాత్రమే కాస్త ఫలిస్తాయి. కాలాన్ని వృథా చేయొద్దు. ఈశ్వరదర్శనం చేయడం మంచిది.

కన్య (Virgo): శారీరక శ్రమ అధికం అవుతుంది. కుటుంబ సభ్యులకు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి. కొన్ని కీలకమైన పనులు ఆలస్యమవుతాయి. పై అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. శని ధ్యానం చేయాలి. 

తుల (Libra): నూతనంగా తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూలంగా ఉంది. ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కుటుంబసభ్యుతో ప్రేమగా ఉండండి. సాయి నామాన్ని స్మరిచండి.

వృశ్చికం (Scorpio): మంచి వాతావరణం ఉంటుంది. ఒక శుభవార్త వింటారు. బంధుమిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. ప్రయాణ సూచన ఉంది. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయండి.

ధనస్సు (Sagittarius): ఏ పని చేసినా ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి పని మీకు లాభిస్తుంది. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి.

మకరం (Capricorn): కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి. మీ ఆలోచనలతో పనులను పూర్తి చేస్తారు. మీ పని మీరు చేసుకోండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఉద్యోగస్థులకు కలిసిరాదు. గణపతిని ఆరాధిస్తే మంచిది.

కుంభం (Aquarius): అన్ని రంగాల వారు ఓ శుభవార్త వింటారు. బంధుమిత్రులు లేదా స్నేహితులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది. పాత బకాయిలు వసూల్ అయ్యే అవకాశం ఉంది. కనకధారాస్తవం పఠించాలి.

మీనం (Pisces): కీలక పనులు పూర్తవుతాయి. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. బంధువులను కలుస్తారు. విహార యాత్రకు ప్లాన్ చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం.

Also Read: YS Sharmila to TS Speaker Pocharam: నన్ను మరదలు అన్నోడిని వదిలేస్తారా? వైఎస్ షర్మిల

Also Read: Medicines Banned: జింటాక్, ర్యాంటాక్ మందులతో కేన్సర్, 26 మందుల్ని నిషేధించిన కేంద్రం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News