Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్, 18 వేల రూపాయల Realme 9i5G ఫోన్.. 850 రూపాయలకే

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేసే సేల్ కంటే ముందే కొన్ని బ్రాండెడ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. 18 వేల రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 850 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు..ఎలాగంటే  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 19, 2022, 03:14 PM IST
Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్, 18 వేల రూపాయల Realme 9i5G ఫోన్.. 850 రూపాయలకే

Flipkart Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేసే సేల్ కంటే ముందే కొన్ని బ్రాండెడ్ ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు ఉన్నాయి. 18 వేల రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 850 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు..ఎలాగంటే

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియనా్ డేస్ సేల్ 2022 మరి కొద్దిరోజుల్లో అంటే సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ సేల్ కంటే ముందే ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కళ్లు చెదిరే డిజైన్ , అద్భుత ఫీచర్లు కలిగిన రియల్ మి 9ఐ 5జి స్మార్ట్‌ఫోన్ కేవలం 850 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం..

రియల్‌మి 9ఐ 5జి స్మార్ట్‌ఫోన్ అసలు ధర 17,999 రూపాయలు కాగా ఫ్లిప్‌కార్ట్‌లో 16 శాతం డిస్కౌంట్ అనంతరం 14,999 రూపాయలకు లభిస్తోంది. దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్‌లో భాగంగా 14,150 రూపాయలు తగ్గుతాయి. ఎక్స్చేంజ్ ఆఫర్ అనేది మీ పాత ఫోన్ కండీషన్, మోడల్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తిస్తే మీకు 18 వేల స్మార్ట్‌ఫోన్ కేవలం 850 రూపాయలకే లభించనుంది. ఒకవేళ ఎక్స్చేంజ్ కాకపోయినా..ఇతర బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లతో 3-4 వేల తగ్గవచ్చు. అప్పుడు కూడా 18 వేల స్మార్ట్‌ఫోన్ మీకు 10-11 వేలకు మాత్రమే లభిస్తుంది. 

Realme 9i 5G features

రియల్ మి 9ఐ 5జి స్మార్ట్‌ఫోన్ అనేది మెటాలికా గోల్డ్ 64 జీబీలో లభ్యం కానుంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది. 6.6  ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగాపిక్సెల్ రెండు సెన్సార్ కెమేరాలు, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమేరా ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు. మరోవైపు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యముంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 5జి ప్రోసెసర్‌తో పనిచేస్తుంది. 

Also read: Gold Price Today: దేశంలో స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు, తాజా రేట్లు ఇవిగో...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News