Thaar Maar Thakkar Maar : తార్ మార్ టక్కర్ మార్ వచ్చేసింది.. మెగా ఫాన్స్ కు పూనకాలే!

Thaar Maar Thakkar Maar Lyrical Video from God Father:   సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘’తార్ మార్ టక్కర్ మార్’’ ఎట్టకేలకు విడుదలైంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 21, 2022, 06:35 PM IST
Thaar Maar Thakkar Maar : తార్ మార్ టక్కర్ మార్ వచ్చేసింది.. మెగా ఫాన్స్ కు పూనకాలే!

Thaar Maar Thakkar Maar Lyrical Video from God Father: సెప్టెంబర్ 15వ తేదీన విడుదల కావాల్సిన గాడ్ ఫాదర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘’తార్ మార్ టక్కర్ మార్’’ ఎట్టకేలకు విడుదలైంది. మేకర్స్ ప్రకటించిన విధంగానే చెప్పిన సమయానికి సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఆద్యంతం ఒక మాస్ నెంబర్ గా సాగింది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో గాడ్ ఫాదర్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పెరిట రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ ను అనంత శ్రీరామ్ రచించారు. ఇక శ్రేయ ఘోషల్ తనదైన వాయిస్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సుమారు నాలుగు నిమిషాల నిడివి ఉన్న ఈ సాంగ్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా సాగింది. ఈ సాంగ్ లో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, మెగాస్టార్ చిరంజీవి కలిసి కనిపించబోతున్నారు అని ముందు నుంచే ప్రచారం జరిగింది. ఇక ఈ సాంగ్ ను ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News