All Set For Ponniyin Selvan All Time Record Opening In Tamil Cinema: మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన పొన్నియన్ సెల్వన్ సినిమా మీద తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తమిళ సినీ ప్రేక్షకులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఖచ్చితంగా బాహుబలి లాంటి సినిమా రికార్డులను బద్దలు కొడుతుందని అంచనాతో ఉన్నారు. అయితే వాస్తవానికి వస్తే నిజంగా ఒక తమిళ సినిమాకు ఇంత స్థాయిలో క్రేజ్ ఏర్పడడం ఇదే మొదటిసారి అని చెబుతున్నారు.
ఈ సినిమాకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మంచి జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. మిగతా భాషల విషయం పక్కన పెట్టి తమిళ వర్షన్ విషయానికి వస్తే ఇప్పటివరకు తలపతి విజయ్ హీరోగా నటించిన బీస్ట్ సినిమా ఓపెనింగ్ రికార్డులలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సినిమా కేవలం తమిళ వర్షన్ ఒక్కటే 75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ పొన్నియన్ సెల్వన్ సినిమా బాగుండి మౌత్ టాక్ మంచిగా బయటకు వస్తే కనుక ఆ రికార్డు బద్దలు కొట్టడం ఏమీ పెద్ద విషయమేమీ కాదని తమిళ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక ఈ సినిమా మీద తెలుగు సహా ఇతర భాషలలో కూడా మంచి అంచనాలు ఏర్పడేలా మణిరత్నం అండ్ టీం ప్రమోషన్స్ చేస్తోంది. ఇప్పటివరకు ఒక తమిళ సినిమా మిగతా భాషలన్నింటిలో కలిపి టాప్ కలెక్షన్లు సాధించింది అంటే అది రజినీకాంత్ హీరోగా వచ్చిన రోబో అలాగే కబాలి సినిమాలు. రోబో సినిమా 90 కోట్లు వసూలు చేస్తే కబాలి సినిమా 95 కోట్లు వసూలు చేసి అన్ని భాషలలోనూ కలిపి తమిళంలో ఓపెనింగ్ వసూళ్లు భారీగా రాబట్టిన సినిమాలుగా నిలిచాయి.
ఇక పొన్నియన్ సెల్వన్ సినిమా ఈ రికార్డులను బద్దలు కొట్టడం ఏమాత్రం కష్టం కాదని అంచనాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తీ, చియాన్ విక్రమ్, జయం రవి వంటి వారు నటిస్తుండడంతో ఇదేమి పెద్ద విషయం కాదని అంటున్నారు . రవివర్మన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్టుగా చెప్పబడుతున్న ఈ సినిమాని తెలుగులో దిల్ రాజు కొనుగోలు చేశారు.
సుమారు 10 కోట్ల రూపాయల మేర హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తమిళ సినిమాలను ఆదరిస్తారు కానీ ఇది కాస్త రాచరిక నేపధ్యం ఉన్న సినిమా కావడంతో దిల్ రాజు రిస్క్ తీసుకోకుండా తన డిస్ట్రిబ్యూటర్ల చేత అడ్వాన్స్ బేసిస్ లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఒకవేళ సినిమా గనుక బాగా ఆడకపోతే డబ్బులు వెనక్కి ఇచ్చేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక ప్రస్తుతానికి తెలుస్తున్న సమాచారం మేరకు రెండు కోట్ల రూపాయల వరకు తెలుగు ప్రమోషన్స్ కోసం సినిమా యూనిట్ ఖర్చు పెట్టేందుకు బడ్జెట్ సెట్ చేసుకుందని అంటున్నారు.
అందులో భాగంగానే హైదరాబాదులో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారని, మిగతా డబ్బుతో టీవీ, మీడియా ప్రమోషన్స్ కానిస్తారని అంటున్నారు. ఏదేమైనా తమిళ సినీ ప్రేమికులందరూ తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టకపోయినా తమిళ సినిమాల ఓపెనింగ్ రికార్డులను బద్దలు కొట్టినా అది ఒక పెద్ద విషయంగానే భావించాల్సి ఉంటుంది. మరి చూడాలి ఏం జరగబోతుంది అనేది.
Also Read: Bimbisara Girl in God Father: బింబిసారకి గాడ్ ఫాదర్ కి ఉన్న కనెక్షన్ ఏమిటో తెలుసా?
Also Read: Mahesh Babu Zee Telugu : జీ తెలుగు అవార్డుల వేడుకకు మహేష్ బాబు.. ఇక రచ్చే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook