Meesho Online Shopping: 'మీషో'లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెడితే.. వచ్చింది ఏంటో తెలిస్తే షాకే! డెలివరీ బాయ్‌ని పట్టుకుని

Bihar Man Orders Drone Camera in Meesho, but Gets Potatoes. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన డ్రోన్‌ కెమెరాకు బదులుగా.. కిలో బంగాళదుంపలు వచ్చాయి. ఈ ఘటన తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 28, 2022, 03:13 PM IST
  • 'మీషో'లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెడితే
  • వచ్చింది ఏంటో తెలిస్తే షాకే
  • డెలివరీ బాయ్‌ని పట్టుకుని
Meesho Online Shopping: 'మీషో'లో డ్రోన్ కెమెరా ఆర్డర్ పెడితే.. వచ్చింది ఏంటో తెలిస్తే షాకే! డెలివరీ బాయ్‌ని పట్టుకుని

Bihar Man Recieve 1kg Potatoes Instead Of Drone Camera From Meesho: ప్రస్తుతం అంతా 'ఆన్‌లైన్‌ షాపింగ్‌' హవా నడుస్తోంది. ఏది కావాలన్నా ఇంట్లోనే ఉండి తెచ్చేసుకుంటున్నారు. ఎన్నో ఆన్‌లైన్‌ సంస్థలు అందుబాటులో ఉండడంతో.. చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో ఆర్డర్‌ పెట్టేసి సమయానికి ఇంటికి తెచ్చుకుంటున్నారు. అయితే ఆన్‌లైన్‌ ఆర్డర్‌లు ఒక్కోసారి కస్టమర్లకు ఊహించని ట్విస్టులు కూడా ఇస్తుంటాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వస్తువుకు బదులుగా.. మరొకటి డెలివరీ అవుతుంటుంది. ఇది చూసిన కస్టమర్ అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. ఇలాంటి ఘటనే తాజాగా బీహార్‌లో చోటుచేసుకుంది. 

భారతదేశంలో ప్రస్థుహం పండుగ సీజన్ మొదలైంది. ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు మంచిమంచి ఆఫర్‌లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. చాలా వెబ్‌సైట్‌లు భారీ తగ్గింపు ఇవ్వడంతో కస్టమర్లు పండగ చేసుకుంటున్నారు. ఈ క్రమమలోనే బీహార్‌ నలందాలోని పర్వాల్‌పూర్‌కు చెందిన చైతన్య కుమార్ అనే వ్యక్తి ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ 'మీషో'ను ఓపెన్ చేశాడు. అందులో రూ. 84,999 డిజెఐ డ్రోన్‌ కెమెరా రూ. 10212కి అందుబాటులో ఉంది. అనుమానం వచ్చి కంపెనీతో మాట్లాడి స్పష్టత తీసుకున్న తర్వాతే అతడు డ్రోన్‌ కెమెరాను ఆర్డర్ చేశాడు.

డ్రోన్‌ కెమెరాకు సంబందించిన డబ్బును చైతన్య కుమార్ ఆన్‌లైన్‌లో చెల్లింపు చేశాడు. ఇక పార్సిల్ పట్టుకుని మీషో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ చైతన్య కుమార్ ఇంటికి వచ్చాడు. మీషో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ని పార్శిల్‌ను అన్‌బాక్స్ చేయమని చెప్పిన చైతన్య.. వీడియో కూడా తీస్తాడు. డెలివరీ బాయ్ పార్శిల్ ఓపెన్ చేయగా.. అందులో డ్రోన్ కెమెరాకు బదులు ఓ కిలో బంగాళదుంపలు (10 బంగాళదుంపలు) కనిపించాయి. దాంతో చైతన్య షాక్ అయ్యాడు. ఇదేనా డ్రోన్‌ కెమెరా అంటూ డెలివరీ బాయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేయగా.. దీంతో తనకు సంబంధం లేదని చెపుతాడు. ఆపై చైతన్య పర్వాల్‌పూర్ సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. దరఖాస్తు స్వీకరించిన అనంతరం ఈ విషయంలో తగు చర్యలు తీసుకుంటామని పర్వాల్‌పూర్ ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. 

Also Read: Saniya Iyappan Video: అక్కడ చేయి వేశాడని.. ఆకతాయి చెంప పగలగొట్టిన హీరోయిన్ (వీడియో)!

Also Read: IND vs SA Squad: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌.. టీమిండియాకు దూరమైన కీలక ప్లేయర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x