CM Kcr: యాదాద్రిని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. యాదాద్రి ఆలయానికి అనుబంధంగా జరిగే నిర్మాణాలు ఆధ్యాత్మిక శోభ విలసిల్లేలా అత్యంత వైభవంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.43 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
వైటీడీఏకు 2157 ఎకరాల భూమిని రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో అప్పగిస్తుందని స్పష్టం చేశారు. దాని నిర్వహణను వైటీడీఏ అధికారులు చూసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈభూమిని ఆలయ అవసరాలు, పోలీస్ శాఖ, ఫైర్ స్టేషన్, హెల్త్, రవాణా, పార్కింగ్ వంటి యాదాద్రి అభివృద్ధికి సంబంధించిన అనుబంధ సేవల కోసం మాత్రమే వినియోగించుకోవాలన్నారు సీఎం కేసీఆర్. ఆలయ అర్చకులు, సిబ్బంది కూడా ఇందులోనే ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు.
యాదాద్రిలో ఉన్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించి..పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. యాదాద్రి టెంపుల్ టౌన్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కాటేజీల నిర్మాణం, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా, పవిత్రమైన భావన వచ్చేలా చూడాలన్నారు. పక్క ప్రణాళిక ప్రకారం యాదాద్రి పరిసరాలు అభివృద్ధి జరగాలని స్పష్టం చేశారు. హెలిపాడ్‌ల నిర్మాణం కూడా చేపట్టాలని ఆదేశించారు.
వైటీడీఏ సమీపంలో జరిగే ప్రైవేట్ నిర్మాణాలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం కేసీఆర్. వైటీడీఏ పరిధిలో ఉన్న వంద ఎకరాల అడవిని నృసింహ అభయారణ్యం పేరిట అద్భుతంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. స్వామి వారి పూజకు వాడే పూలు అని ఆ ఆరణ్యంలోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 50 ఎకరాల్లో అమ్మవారి పేరుపై ఓ అద్భుతమైన కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు.
ఆలయం పరిసరాలు, ఇతర ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ పక్కగా ఉండాలన్నారు సీఎం కేసీఆర్. ఆలయానికి వచ్చే భక్తులకు క్యూలైన్లతోపాటు ఇతర సౌకర్యాలు సక్రమంగా ఉండాలని చెప్పారు. దీక్షాపరుల మంటపం, వ్రత మంటపం, ఆర్టీసీ బస్టాండ్, స్టామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 250 ఎకరాల్లో నిర్మించే 250 కాటేజీలను నాలుగు భాగాలుగా విభజించి..అద్భుతంగా నిర్మించాలన్నారు సీఎం.
అంతకుముందు యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని సీఎం కేసీఆర్, ఆయన సతీమణి శోభ దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ దివ్య విమాన గోపురానికి కేజీ 16 తులాల బంగారాన్ని విరాళంగా ఇచ్చారు.
Also read:Russia vs Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా క్రెమ్లిన్ దాడులు..23 మంది పౌరుల మృతి..28 మందికి గాయాలు..!
Also read:PM Modi: మానవత్వం చాటిన ప్రధాని మోదీ..అసలేమి జరిగిదంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
CM Kcr: యాదాద్రిపై ఆధ్యాత్మిక శోభ విలసిల్లాలి..పనులపై సీఎం కేసీఆర్ ఆరా..!
యాదాద్రిలో సీఎం కేసీఆర్
అనంతరం కేసీఆర్ సమీక్షా సమావేశం
ఆలయ అభివృద్ధి పనులపై ఆరా