Bigg Boss Adireddy : నువ్ ఏం పీకావ్.. ఆదిరెడ్డిని ఏసుకున్న నాగార్జున

Bigg Boss 6 Telugu fourth weekend Episode బిగ్ బాస్ ఇంట్లో నాగార్జున ప్రస్తుతం గరం గరం మీదున్నట్టు కనిపిస్తోంది. కంటెస్టెంట్ల ఆట తీరుపై కౌంటర్లు వేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 1, 2022, 11:39 AM IST
  • బిగ్ బాస్ ఇంట్లో నాలుగో వారం
  • వీకెండ్ ప్రోమోలో నాగ్ ఫైర్
  • ఆదిరెడ్డి పరువుతీసిన హోస్ట్
Bigg Boss Adireddy : నువ్ ఏం పీకావ్.. ఆదిరెడ్డిని ఏసుకున్న నాగార్జున

Nagarjuna - Adireddy : బిగ్ బాస్ ఇంట్లో నాగార్జున తన కంటెస్టెంట్లను దారిలో పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఆటలో కాస్త దారి తప్పుతున్నాడనిపిస్తే మందలిస్తుంటాడు. అవసరం అయినప్పుడు కంటెస్టెంట్ల మీద కౌంటర్లు వేస్తుంటాడు. వారిని సరదాగా ఆట పట్టిస్తుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం నాగార్జున ఆగ్రహాన్ని వ్యక్తి చేస్తుంటాడు. బిగ్ బాస్ రూల్స్ పాటించకపోయినా, ఫుడ్ వేస్ట్ చేసినా కూడా ఒప్పుకోడు. గత సీజన్లోనూ ఫుడ్ విషయంలో పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. అసలే బిగ్ బాస్ ఇంట్లో అన్నం సరిగ్గా దొరకదని అందరూ అంటుంటారు. ఫుడ్, వాటర్, నిద్ర లేక అల్లాడిపోతోంటామని చెబుతుంటారు.

అయితే తాజాగా వదిలిన ప్రోమోలో నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ నాలుగో వారంలో నాగార్జున ఇంటి సభ్యులు చేసిన పనుల మీద కౌంటర్లు వేశాడు. మందలించాల్సిన వాళ్లను గట్టిగానే మందలించినట్టు కనిపిస్తోంది. బాలాదిత్య వల్ల గీతూ ఏడ్వడం, బాలాదిత్యకు కోపం రావడం చూసి నాగార్జున ఆశ్చర్యపోయాడు. ఇక అర్జున్ కళ్యాణ్ శ్రీ సత్య ట్రాక్ మీద కూడా స్పందించాడు. టాస్క్ ఆడిన తీరు మీద కౌంటర్లు వేశాడు. మొత్తానికి నీ కోరికలన్నీ తీర్చుకున్నావ్ కదా? అంటూ సెటైర్లు వేశాడు. దీంతో శ్రీ సత్య మళ్లీ తల పట్టేసుకుంది. ఇదంతా ఇలా ఉంటే.. ఈ వారం సూర్య కాస్త డల్ అయ్యాడు. అదే షన్ను భాషలో చెప్పాలంటే.. ట్రిప్ అయ్యాడు.

సూర్య బాధ ఏంటో సరిగ్గా అర్థం కావడం లేదు. ఆరోహి సంగతి కూడా అలానే ఉంది. ఫ్రెండ్స్ అంటారు.. కానీ మళ్లీ వేరే వాళ్లతో కాస్త చనువుగా ఉంటే.. తట్టుకోలేకపోతోన్నారు. ఆరోహి, సూర్య ఇద్దరూ అలానే ప్రవర్తిస్తున్నారు. ఫ్రెండ్స్ అంటూనే ఇలాంటి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. సూర్య, ఆరోహి అర్దరాత్రి ముచ్చట్లు వైరల్ అవుతున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్లోనూ సూర్యతెగ ఏడ్చేశాడు. తన అమ్మ గుర్తుకు వస్తుందంటూ బోరుమన్నాడు. ఇలా ఏడిస్తే బాగోలేదని ఆరోహి చెప్పింది. నీకు అమ్మైనా ఉంది.. నాకు అయితే అమ్మ కూడా లేదు కదా? అని కీర్తి సర్దిచెప్పింది. ఇలా సూర్య కాస్త అదుపు తప్పేశాడు.

 

ఈ క్రమంలోనే సూర్య తన ఫుడ్ కూడా విసిరగొట్టేశాడు. డస్ట్ బిన్లో పడేశాడు. దీంతో నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఫుడ్ అంటే దేవుడితో సమానం కదా? అలా ఎలా చేస్తావ్.. బిగ్ బాస్ ఇంట్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ అంటూ సూర్యకు చీవాట్లు పెట్టాడు. కెప్టెన్ అయిన ఆదిరెడ్డిని కార్నర్ చేశాడు. ఫుడ్ విషయంలో నేను పనిష్మెంట్ ఇవ్వలేను అని గత వారం చెప్పావ్.. ఇప్పుడు నువ్వేం పీకావ్ అంటూ ఆదిరెడ్డిని నిలబెట్టి పరువుతీశాడు నాగార్జున.

Also Read : ఆచార్య విషయంలో అదే బాధ.. అందుకే రాజమౌళి సినిమాలో నటించను : చిరంజీవి

Also Read : Prithvi raj : భార్యకు నెలకు రూ. 8 లక్షల భరణం.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీకి కోర్టు షాక్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News