Weight Loss Diet: చాలామంది బరువు తగ్గడానికి కష్టపడి వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమంది అయితే ఆహారాలను మానుకుంటారు. ఇవన్నీ చిట్కాలు పాటించి బరువు తగ్గుతారు. అయితే కొంత కాలమైన తర్వాత వీటిని క్రమంగా మానేస్తారు వీటిని మానేయడం వల్ల వారు సులభంగా బరువు పెరుగుతున్నారు. అంతేకాకుండా చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి కచ్చితంగా శరీరంలో పెరుగుతున్న చెడు కొలస్ట్రాల్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్లే బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికోసం తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పలు చిట్కాలు పాటించడం చాలా మేలు. దీనికోసం ఎలాంటి చిట్కాలు పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మాంసం తింటున్నారా:
బరువు తగ్గిన తర్వాత చాలామంది మాంసాలను బిచ్చగా విడిగా తింటున్నారు. ఇలా తినడం వల్ల కూడా క్రమంగా బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు మాంసాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మాంసాలకు బదులుగా పాలతో చేసిన జున్ను, పన్నీర్ వంటి అధిక పోషకాలు ఉన్న ఆహారాలు తీసుకోవడం శరీరానికి చాలా మంచిది. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గడమే కాకుండా శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
భోజనానికి ముందు నీటిని అధిక పరిమాణంలో తీసుకోవాలి:
భోజనం ముందు నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గే అవకాశాలున్నాయి దీనివల్ల మీరు కేవలం తక్కువ పరిమాణంతోనే ఆహారాలను తీసుకుంటారు. మన మెదడు ఆకలి అవుతుందని సంకేతం ఇచ్చినప్పుడు..తప్పకుండా బరువు తగ్గే క్రమంలో నేటి శాతాన్ని ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకోవడం వల్లే సులభంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఈ రెండు చిట్కాలను ఉపయోగిస్తే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook