Virat Kohli gives autograph to fans during India vs Western Australia XI match: టీ20 ప్రపంచకప్ 2022కు ముందు జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ చెలరేగాడు. పెర్త్ వేదికగా సోమవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఎలెవన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్య 35 బంతుల్లో 52 పరుగులు చేశాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి. సూర్య చెలరేగడంతో ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సహా హార్దిక్ పాండ్యా (20 బంతుల్లో 29), దినేష్ కార్తీక్ (19 నాటౌట్) రాణించారు. అయితే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఓపెనర్ వచ్చిన రిషబ్ పంత్ 17 పరుగులు చేశాడు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బౌలర్లలో జాసన్ బెహ్రెండోర్ఫ్, మథ్యూ కెల్లీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇక 159 పరుగుల లక్ష్య ఛేదనలో వెస్ట్రన్ ఆస్ట్రేలియా 145 పరుగులకే పరిమితమైంది. దాంతో భారత్ 13 పరుగుల తేడాతో గెలుపొందింది. భువనేశ్వర్ కుమార్ మరియు అర్ష్‌దీప్ సింగ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Nice gesture from Virat Kohli to give autograph to fans ahead of the warm up match. pic.twitter.com/baQulbApg6
— Johns. (@CricCrazyJohns) October 10, 2022
ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు ఆడలేదు. ఇద్దరు విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ.. మ్యాచ్ జరిగే సమయంలో మైదానంలోకి వచ్చి బౌండరీ వద్ద ఉన్న కొందరు అభిమానులను కలిశారు. అభిమానులకు షేక్ హ్యాండ్ ఇస్తూ.. ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు. కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇస్తుండగా.. స్టేడియంలోని భారత అభిమానులు కోహ్లీ కోహ్లీ అంటూ అరవసాగారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Innings Break!#TeamIndia post a total of 158/6
Suryakumar Yadav 52 off 35 (3x4, 3x6)
Hardik Pandya 29 off 20 pic.twitter.com/ghN3R0coqr— BCCI (@BCCI) October 10, 2022
Also Read: Mohammed Siraj Throw: సిరాజా ఎంత పని జేస్తివి.. ఔట్ చేయకపోగా బౌండరీ ఇస్తివిగా (వీడియ
Also Read: ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరుకానున్న సీఎం కేసీఆర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook