Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ జంప్.. నెక్స్ట్ ఎవరు? మునుగోడు టీఆర్ఎస్ లో కలవరం...

Munugode Bypoll: బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు.ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది.

Written by - Srisailam | Last Updated : Oct 15, 2022, 09:19 AM IST
  • బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్?
  • బూర బాటలో మరికొందరు లీడర్లు
  • మునుగోడు టీఆర్ఎస్ లో కలవరం
Boora Narsaiah Goud: బూర నర్సయ్య గౌడ్ జంప్.. నెక్స్ట్ ఎవరు? మునుగోడు టీఆర్ఎస్ లో కలవరం...

Munugode Bypoll: తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తున్న కొద్ది సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. నామినేషన్ల పర్వం ముగిసిన రోజే అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి.. బీజేపీలో రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. గురువారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన బూర.. బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారని..  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారని తెలుస్తోంది.

మునుగోడు ఉప ఎన్నిక టికెట్ ఆశించిన బూర.. కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. అయితే కూసుకుంట్లను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ప్రగతి భవన్ లో బూరతో మాట్లాడి బుజ్జగించారు సీఎం కేసీఆర్. తర్వాత మీడియాతో మాట్లాడిన బూర.. కేసీఆర్ ఏం చేసినా పార్టీ ప్రయోజనాల కోసమేనని చెప్పారు. కూసుకుంట్లను మంచి మెజార్టీతో గెలిపిస్తామన్నారు. గురువారం జరిగిన కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు బూర. మంత్రి కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చారు. దీంతో  టీఆర్ఎస్ పార్టీలో అంతా సెట్ అయిందని భావించారు. అయితే  కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కలిసి చండూరు వెళ్లిన బూర.. హైదరాబాద్ తిరిగి రాగానే పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఆ వెంటనే కొందరు తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం వెనుక శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో మాట్లాడి బూరకు స్పష్టమైన హామీ ఇప్పించారని సమాచారం.

తెలంగాణ ఉద్యమంలో డాక్టర్ జేఏసీ చైర్మెన్ గా కీలకంగా వ్యవహించారు బూర నర్సయ్య  గౌడ్. 2014లో భువనగిరి ఎంపీగా బూరను కేసీఆర్ బరిలోకి దింపారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో  ఓడిపోయారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో  మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేయాలని భావించారు. అయితే మంత్రి జగదీశ్ రెడ్డి ఆయన్ను దూరంగా పెడుతూ వచ్చారు. గత రెండు నెలలుగా మునుగోడులోనే మకాం వేసిన మంత్రి.. బూరను అవమానించేలా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలకు బూరను ఆహ్వానం అందలేదు.మండలాల వారీగా నిర్వహించిన ఆత్మీయ సమావేశాలకు పిలవలేదు. దీంతో మంత్రి తనను కావాలనే అవమానిస్తున్నారని బూర  తీవ్ర ఆవేదనకు గురైనట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అనుచరుల నుంచి వచ్చిన ఒత్తిడితో.. గౌరవం లేని చోట మనసు చంపుకుని ఉండలేక బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు.

బూర నర్సయ్య గౌడ్ తో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు టీఆర్ఎస్ బీసీ నేతలు కాషాయ కండువా కప్పుకుంటారని చెబుతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో బూర మంతనాలు సాగించారని అంటున్నారు. కొందరు బీసీ నేతలు బూరకు మద్దతుగా ఢిల్లీకి వెళ్లారని కూడా తెలుస్తోంది. బూర బీజేపీలో చేరిన తర్వాత ఉమ్మడి జిల్లా నుంచి ఆ పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయంటున్నారు. మరోవైపు మునుగోడు టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఆయన కూడా మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అయితే కర్నె అనుచరులు మాత్రం ఆయన పార్టీ మారే అవకాశం లేదని చెబుతున్నారు. మునుగోడు టికెట్ ఆశించిన నారబోయిన రవి ముదిరాజ్, కర్నాటి విద్యాసాగర్ తోనూ బీజేపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని ప్రచారం సాగుతోంది.

Read Also: Hyderabad Rain Alert:  హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. లోతట్టు ప్రాంతాలు జలమయం.. మరో రెండు రోజులు అలర్ట్

Read Also: Nayanthara Surrogacy : చిక్కుల్లో నయన్ విఘ్నేశ్.. ఆ లూప్ హోల్‌తో బయటపడే ప్లాన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News