Balakrishna Kind Gesture: అన్నం పెట్టిన వాళ్లకి ఆపదొస్తే తట్టుకోలేక పోయాడు.. మూడే రోజుల్లో హాస్పిటలే కదిలొచ్చింది.. దటీజ్ బాలయ్య!

Nandamuri Balakrishna Kind Gesture Revealed after 17 years: ఎప్పుడో 17 ఏళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ చేసిన ఒక మంచి పని ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 19, 2022, 10:05 AM IST
Balakrishna Kind Gesture: అన్నం పెట్టిన వాళ్లకి ఆపదొస్తే తట్టుకోలేక పోయాడు.. మూడే రోజుల్లో హాస్పిటలే కదిలొచ్చింది.. దటీజ్ బాలయ్య!

Nandamuri Balakrishna Arranged an Ambulance at Chalakudy Forest Area: నందమూరి బాలకృష్ణ గురించి సోషల్ మీడియాలో ఎప్పుడూ ఒక రకమైన ప్రచారం జరుగుతూ ఉంటుంది, ఆయన చాలా కోపిష్టి అని ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఆయనలో ఉన్న మరో కోణాన్ని ఇప్పుడు అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ఒక షో ప్రజల ముందుకు తీసుకు వస్తే వారంతా కూడా బాలకృష్ణ మంచితనానికి చాలాకీతనానికి మాటకారి తనానికి ఫిదా అవుతున్నారు, అయితే బాలకృష్ణ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారు అనే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది. ఎప్పుడో జరిగిన ఘటన తాజాగా ఒక సోషల్ మీడియా నెటిజన్ ఒకరు షేర్ చేయడంతో తెరమీదకు వచ్చింది. శివ అనే ఒక నెటిజన్ తన సోషల్ మీడియాలో బాలకృష్ణ విజయేంద్ర వర్మ సినిమా షూటింగ్ సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథనాన్ని పంచుకున్నారు. 

బాలకృష్ణ విజయేంద్ర వర్మ సినిమా షూటింగ్ కేరళలోని చల్లకుడి అనే ఒక మారుమూల ఫారెస్ట్ ఏరియాలో చేశారని చెప్పుకొచ్చారు. ఆ షూటింగ్ కి హరికృష్ణ గారి కుమారుడు జానకిరామ్ తో సహా తన ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ విష్ణు అనే వ్యక్తి కూడా వెళ్లాడని అయితే వర్షాల కారణంగా షూటింగ్ జరుగుతూ ఆగుతూ ఒక షెడ్యూల్ ప్రకారం కాకుండా వర్షాల మీద ఆధారపడి జరిగింద్దని చెప్పకొచ్చారు. అయితే ఒకరోజు భారీ వర్షం వల్ల షూటింగ్ కుదరకపోవడంతో ఖాళీగా ఉన్న బాలకృష్ణ, జానకిరామ్ ఆయన స్నేహితుడు విష్ణుతో కలిసి దగ్గర్లో ఒక డ్యామ్ ఉందని చూడడానికి వెళ్లారట. అయితే ఒక గిరిజన తండా దగ్గరకు వచ్చేసరికి జీప్ టైర్స్ బురదలో కూలిపోయి ముందుకు కదల్లేకపోవడంతో అక్కడే ఆగిపోయారు. సినిమా యూనిట్ కి సమాచారం ఇవ్వాలని భావించినా మొబైల్ సిగ్నల్ కూడా అక్కడికి అందకపోవడంతో చేసేదేమీ లేక అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నిలబడి వర్షం తగ్గుతుందేమో తగ్గిన తర్వాత జీపు బయటకు తోసి బయలుదేర వచ్చు అని ఎదురుచూస్తున్నారట. 
 
అయితే ఆ గిరిజన తండా ప్రజలు వీళ్ళని గమనిస్తూ ఆకలితో ఉండారేమనని గ్రహించి వాళ్ళకి చేపలతో చేతనైన విధంగా వంట చేసి తినడానికి తీసుకొచ్చారట. అయితే జానకిరామ్, విష్ణు తినాలా వద్దా అని ఆలోచిస్తుంటే బాలకృష్ణ మాత్రం వాళ్ళ ఆప్యాయతకు కరిగిపోయి వెంటనే తినడం మొదలుపెట్టారట. ఆ తింటున్న సమయంలోనే నలుగురు గిరిజనులు ఒక మహిళను కర్రలతో తయారు చేసిన కుర్చీ మీద కూర్చోబెట్టి తీసుకు వెళుతూ ఉండగా ఆ మహిళ బాలకృష్ణ, జానకిరామ్, విష్ణు ముగ్గురు ఉన్న ప్రదేశాన్ని దాటేలోపల కళ్ళు తిరిగి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే బాలకృష్ణ లేచి ఏమైందని అడగగా కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుందని చెప్పడంతో బాలకృష్ణ ఫోన్ తీసుకుని సిగ్నల్ వస్తే తన యూనిట్ సభ్యులకి చెప్పి కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నాలు చేయాలన్న తాపత్రయంతో దగ్గరలో ఉన్న పెద్ద చెట్టు కూడా ఎక్కి సిగ్నల్ కోసం చూస్తున్నారు. 

ఇంత లోపే ఆ మహిళ ప్రాణం పోయింది. సరైన వైద్య సదుపాయం లేక మనిషి ప్రాణాలు పోతున్నా ఏమీ చేయలేని గిరిజనుల నిస్సహాయత సాటి మనిషి చలిలో వణుకుతూ నిలబడితే మనకున్న దానిలోనే ఏదో కొంత పెట్టాలనే వారి ఆప్యాయత నచ్చడంతో చలించిపోయిన బాలకృష్ణ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి మూడు రోజులు పట్టిందట. వెంటనే వారికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుంచే హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ తో మాట్లాడి ఏం చేయాలో ఆదేశాలు జారీ చేశారు. షూటింగ్ పూర్తి అవడంతో బాలకృష్ణ అండ్ టీం హైదరాబాద్ చేరుకున్న మూడో రోజు ఆ గిరిజన తండా ముందు సకల సౌకర్యాలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అంబులెన్స్ ఆగిందట. 

అప్పటినుంచి ఆ అంబులెన్స్ గిరిజన తండా కోసమే అక్కడే ఉందని దాని బాధ్యతలు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఇప్పటికీ తీసుకుందని తెలుస్తోంది. ఈ 17 ఏళ్లలో ఎంతోమంది ప్రాణాలు బాలకృష్ణ కాపాడి ఉంటారని శివ తన సోషల్ మీడియా పేజీలో పేర్కొన్నారు. ఆ గిరిజనులకు బాలకృష్ణ ఎవరో తెలియదు, బాలకృష్ణకు ఆ గిరిజనులు ఎవరో తెలియదు కానీ వాళ్ళ కష్టం చూసి స్పందించాడు, మానవత్వానికి కుల మత, భాష, ప్రాంతంతో సంబంధం నిరూపించాడు అలాంటి వ్యక్తి తన నియోజకవర్గ ప్రజల కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకుంటారా అని సదరు నెటిజన్ ప్రశ్నించారు. ఇక ఈ విషయం తెలియడంతో బాలకృష్ణ అభిమానులు మా బాలయ్య ఎప్పుడు అంతే అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఆ కథనాన్ని షేర్ చేస్తున్నారు.
 Also Read: Kantara Movie IMDB rank : దటీజ్ కాంతారా.. దెబ్బకు ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ అవుట్.. చివరకు బాహుబలి కూడా

Also Read: Ginna - Ori Devuda : ఈ వారం బాక్సాఫీస్ వార్.. నిలిచేది ఎవరు?.. జిన్నా పరిస్థితి ఏంటి?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News