Munugode Bypoll: మునుగోడు రిటర్నింగ్ అధికారి అవుట్.. పోలింగ్ వరకు ఇంకెన్ని ట్విస్టులో!

Munugode Bypoll: అభ్యర్థుల గుర్తుల కేటాయింపు వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. రిటర్నింగ్ ఆఫీసర్ పై వేటు వేసింది. ఉప ఎన్నికకు కొత్త రిటర్నింగ్ అధికారి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, సీఈసీకి మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపించారు

Written by - Srisailam | Last Updated : Oct 20, 2022, 02:59 PM IST
  • మునుగోడు ఉపఎన్నికలో సింబల్ వివాదం
  • రిటర్నింగ్ అధికారిపై సీఈసీ వేటు
  • శివకుమార్ కు రోడు రోలర్ గుర్తు కేటాయింపు
Munugode Bypoll: మునుగోడు రిటర్నింగ్ అధికారి అవుట్.. పోలింగ్ వరకు ఇంకెన్ని ట్విస్టులో!

Munugode Bypoll:  తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ అఫ్ అట్రాక్షన్ గా మారిన మునుగోడు ఉప ఎన్నికల్లో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిపైనే వేటు పడటం కలకలం రేపుతోంది. అభ్యర్థుల గుర్తుల కేటాయింపు వివాదంలో కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. రిటర్నింగ్ ఆఫీసర్ పై వేటు వేసింది. ఉప ఎన్నికకు కొత్త రిటర్నింగ్ అధికారి కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు, సీఈసీకి మూడు పేర్లతో ప్రతిపాదనలు పంపించారు. ఆ ముగ్గురిలో ఒకరిని కొత్త రిటర్నింగ్ అధికారిగా నియమించనుంది ఎన్నికల సంఘం.

మునుగోడు ఉప ఎన్నికలో మొదటి నుంచే గుర్తుల వివాదం నడుస్తోంది. కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని పోరాటం చేస్తోంది అధికార టీఆర్ఎస్ పార్టీ. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. అయితే గుర్తుల విషయంలో ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ వివాదం ఉండగానే ఉప ఎన్నికలో నామినేషన్ వేసిన యుగతులసి పార్టీ అభ్యర్థికి కేటాయించి సింబల్ వివాదాస్పదమైంది.  యుగ తులసి పార్టీ అభ్యర్థి కే శివకుమార్ కు మొదట రోడ్ రోలర్ గుర్తు కేటాయించారు. తర్వాత మార్చేసి బేబీ వాకర్ సింబల్ ఇచ్చారు. ఈ విషయంలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు శివకుమార్. తాను కోరుకున్న రోడ్డు రోలర్ సింబల్ కాకుండా బేబీ వాకర్ గుర్తు ఇచ్చారని ఆరోపించారు.

శివకుమార్ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ యాక్షన్ తీసుకుంది. శివకుమార్ కు మొదట కేటాయించిన రోడ్ రోలర్ గుర్తునే తిరిగి కేటాయించాలని ఎన్నికల అధికారిని ఆదేశించింది. అంతేకాదు సింబల్ విషయంలో ఎందుకు నిర్ణయం మార్చుకున్నారో రిటర్నింగ్ అధికారి నుంచి వివరణ తీసుకొని నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ను ఆదేశించింది. తర్వాత తనకు లేని అధికారాలతో సింబల్ మార్చిన  ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్చేసింది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే రిటర్నింగ్ అధికారి శివకుమార్ సింబల్ విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రిటర్నింగ్ ఆఫీసర్ ను మారుస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అధికార పార్టీకి షాకింగ్ లా మారింది. మునుగోడు పోలింగ్ జరిగే వరకు ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయోనన్న ప్రచారం సాగుతోంది.

Read Also: Budida Bikshamaiah Goud: బీజేపికి భిక్షమయ్య గౌడ్ గుడ్ బై.. పార్టీపై సంచలన ఆరోపణలు

Read Also: CM Jagan Mohan Reddy: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై సీఎం జగన్ మాస్ కౌంటర్.. ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటి..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News