Twitter trends today: ప్రముఖ సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లో అదిరిపోయే ట్రెండ్స్ కొనసాగుతున్నాయి. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ తోపాటు ఏపీ మహళాకమిషన్ ట్రెండింగ్ లో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇండియా టాప్ ట్రెండింగ్స్ లో మెుదటి స్థానంలో ఇండియా-పాక్ మ్యాచ్ ఉంటే, రెండో స్థానంలో ఏపీ ఉమెన్ కమిషన్ ఎక్స్ పోజడ్ (#APWomenCommissionExposed) అనే హ్యాష్ టాగ్ ఉండటం విశేషం. ఏపీ మహిళా కమిషన్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉండటానికి ప్రధాన కారణం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నోటీసులు జారీ చేయడమేనని తెలుస్తోంది.
ఇటీవల పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ చేసింది. మూడు పెళ్లిళ్లపై పవన్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని..మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. మహిళలను స్టెపిని అని పేర్కొనడం తీవ్ర ఆక్షేపణీయమని నోటీసుల్లో పేర్కొన్నారు. ''రీసెంట్ గా మీరు మూడు పెళ్లిళ్లు అంశంపై చేసిన వ్యాఖ్యలు సమాజంలో పెద్ద దుమారాన్నే రేపాయి. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే మెసెజ్ ఇస్తూ మీరు మాట్లాడిన మాటలు అందరినీ షాక్ కు గురిచేశాయి. ఈ వ్యాఖ్యలపై మీరు క్షమాపణ చెప్తారని ఎదురుచూశాం. కానీ మీ మాటలపై మీకు పశ్చాత్తాపం లేదు'' అంటూ కమిషన్ నోటీసుల్లో పేర్కొంది.
భరణం ఇచ్చి భార్యను వదిలించుకుపోతే మహిళ జీవితానికి భద్రత ఎక్కడ ఉంటుంది అని కమిషన్ ప్రశ్నించింది. సినిమా హీరోగా, ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షులుగా ఉండి మీరు యువతకు ఇచ్చే సందేశం ఇదేనా అని కమిషన్ నిలదీసింది. వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని, మీరు చేసిన కామెంట్లను వెనక్కి తీసుకోవాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది.
Also Read: Pawan Kalyan Vs Ambati Rambabu: నాలుగో పెళ్లాం.. అరగంట! పవన్ కల్యాణ్, అంబటి మధ్య రచ్చ రచ్చ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook