మటర్ అనేది ఆకుపచ్చ కూరగాయల్లో కీలకమైంది. మటర్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి పూర్తిగా తెలియదు. తెలిస్తే అసలు వదిలిపెట్టరు కూడా.
మటర్‌ను సాధారణంగా ఇతర కూరల్లో కలిపి వండుతుంటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మటర్ చాలా మంచిది. కొలెస్ట్రాల్, మధుమేహం, చర్మ సంరక్షణ, ప్రోటీన్ల లోపం, అజీర్తి వంటి సమస్యలకు మటర్ మంచి పరిష్కారం.
మటర్ అనేది హెచ్ డీఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల నాళికల్లో కొలెస్ట్రాల్ బ్లాక్ కాకుండా ఉంటుంది. బ్లాకేజ్ ముప్పు ఉండదు. గుండెకు ఆరోగ్యం ఉంటుంది.
మటర్ తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే మటర్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మటర్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. మటర్‌లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ మంచిది.
మటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఆరోగ్యానికి మేలు కల్గించే న్యూట్రియంట్లు ఉన్నాయి. మటర్‌లో విటమిన్ బి 6, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మంపై ముడతలు దూరమౌతాయి. మటర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నందున ప్రోటీన్ లోపం ఉండేవారు తినమని వైద్యులు సూచిస్తుంటారు.
మటర్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మటర్‌లో ఉన్నయాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ జీర్ణక్రియకు దోహదపడతాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి.
Also read: Weight Loss Tips: బరువు తగ్గేక్రమంలో రాత్రి పూట ఇలా చేస్తున్నారా.. అస్సలు తగ్గరు ఇలా చేస్తే..
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook