Govt Jobs Updates: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు.. అప్లై చేసుకోండి

RPSC Food Safety Officer Recruitment: రాజస్థాన్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో 200 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2022, 08:15 PM IST
Govt Jobs Updates: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు.. అప్లై చేసుకోండి

RPSC Food Safety Officer Recruitment: మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ విభాగంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 200 పోస్టుల కోసం దరఖాస్తులను రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆహ్వానించింది. ఆన్‌లైన్‌లో నవంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు www.rspc.gov.in వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి. అభ్యర్థులను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు చేయు విధానం:
అభ్యర్థులు కమిషన్ ఆన్‌లైన్ పోర్టల్  https://rpsc.rajasthan.gov.in లేదా SSO పోర్టల్ సిటిజన్ యాప్‌లో ద్వారా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును అప్‌లోడ్ చేయాలి. ఇప్పటికే వన్ టైమ్ రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా SSO పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపిన తరువాత.. అప్లికేషన్, పరీక్ష ఫీజు స్లిప్ ప్రింట్ అవుట్ తీసుకోండి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ దరఖాస్తుకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. కమిషన్ హెల్ప్‌డెస్క్‌ను 1800-180-6127 నంబరులో సంప్రదించవచ్చు. ఫోన్ 0145-2635212/2635200 ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.

జనవరి 1, 2023 నాటికి దరఖాస్తుదారు వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి.. 40 సంవత్సరాలలోపు వారు అర్హులు. ఇతర వివరాల కోసం www.rspc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.

Also Read: IND Vs PAK: టీడీపీతో అట్లుంటది.. ఇండియా-పాక్ మ్యాచ్‌లో జై అమరావతి నినాదం

Also Read: IND vs PAK Star Sports: స్టార్ స్పోర్ట్స్ కీలక నిర్ణయం.. సంబరపడిపోతున్న భారత్ ఫాన్స్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News