IND vs PAK, Pakistan Fans wants Virat Kohli instead of Kashmir: దాయాదులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య గత కొన్నేళ్లుగా జమ్మూ కాశ్మీర్ అంశం పెద్ద సమస్యగా ఉన్న విషయం తెలిసిందే. కాశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య భీకర పోరాటం జరుగుతోంది. దాంతో నిత్యం ఇండో-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంటుంది. ఇప్పటికే భారత్, పాకిస్థాన్ సైన్యాల మధ్య చాలా దాడులు జరిగాయి. 2019లో పుల్వామా దాడి జరగ్గా.. అందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది కూడా. అయితే కాశ్మీర్ కోసం నిత్యం పోరాడే పాకిస్తాన్ ప్రజలు.. ఇప్పుడు మాకొద్దు అంటున్నారు. మీరు చదువుతున్నది నిజమే. అందుకు కారణం ఏంటంటే?
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 23) జరిగిన మ్యాచ్‌లో చివరి బంతికి పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. 160 పరుగుల లక్ష్య చేధనలో రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా స్టార్ బ్యాటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) అండతో చివరి వరకు క్రీజులో నిలబడి టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించాడు.
31 పరుగులకే కీలక నాలుగు వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును విరాట్ కోహ్లీ ఆదుకున్నాడు. పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు చేశాడు. పాక్ పేసర్లు వరుసగా దాడి చేసినా.. తన అనుభవాన్ని ఉపయోగించి క్రీజులో నిలబడ్డాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచును తన ఆటతో ముందుగా రేసులోకి తెచ్చాడు. చివరి రెండు ఓవర్లలో 31 పరుగులు చేయాల్సి రాగా.. 19వ ఓవర్ చివరి 2 బంతులకు అద్భుత సిక్సులు బాదాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సిన సమయంలో అద్భుత సిక్స్ బాది లక్ష్యాన్ని కరిగించాడు. పాక్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వని కోహ్లీ.. ఒంటిచేత్తో టీమిండియాకు విజయాన్ని అందించాడు.
Yeh mangane ki aadat! Kuch bhi nahi milega pic.twitter.com/XjU5JTfFGc
— Lt Gen Vinod Bhatia Retd (@Ptr6Vb) October 24, 2022
టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫాన్స్, మాజీ క్రికెటర్స్, ప్రస్తుత ఆటగాళ్లు కూడా కోహ్లీని ఆకాశానికెత్తేస్తున్నారు. ఇందుకు పాకిస్తాన్ ఫాన్స్ కూడా అతీతమేమీ కాదు. కోహ్లీ బాగా ఆడాడని పొగుడుతున్నారు. కొందరు అయితే 'కాశ్మీర్ మాకు వద్దు.. విరాట్ కోహ్లీని ఇచ్చేయండి' అని ఓ బ్యానర్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొందరు పాకిస్తాన్ జెండాతో బ్యానర్ పట్టుకుని.. 'మాకు కాశ్మీర్ వద్దు.. విరాట్ కోహ్లీకి ఇవ్వండి' అంటూ స్లోగన్ రాశారు. నిజానికి ఇది 2019 వన్డే ప్రపంచకప్ నాటిదే అయినా.. మరోసారి ఫాన్స్ అదే బ్యానర్‌ని పోస్టుగా పెడుతున్నారు. కాశ్మీర్, విరాట్ కోహ్లీని ఇవ్వడం జరిగే పనికాదు లే అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.
Also Read: దీపావళి స్పెషల్.. శారీలో అందాల రాణిలా అనుష్క శర్మ! విరాట్ కోహ్లీ చాలా లక్కీ
Also Read: భారత్ చీట్ చేసి గెలిచింది.. పాకిస్తాన్ మాజీలు, అభిమానులకు కౌంటర్ ఇచ్చిన దిగ్గజ అంపైర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి