Music Director Raghuram Passes Away: తాజాగా సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఇప్పటికే పలువురు నటీనటులు, టెక్నీషియన్లు మృత్యువాత పడగా ఇప్పుడు తాజాగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూశారు. సురేష్ సంగయ్య దర్శకత్వంలో విధార్థ్ -రవీనా రవి నటించిన ఒరు కిదయిన్ కరుణై మను సినిమా అటు విమర్శకుల నుంచే కాకుండా సినీ అభిమానుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాకు సంగీత దర్శకుడు రఘురామ్ అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందించారు. తాజాగా ఆయన మృత్యువాత పడినట్టు తెలుస్తోంది. గత కొన్నాళ్లుగా జాండీస్ తో బాధ పడుతున్నాయా ఆయన తన ఆరోగ్య పరిస్థితిని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అదే కాకుండా మోటార్ న్యూరాన్ అనే వ్యాధి బారిన పడి చికిత్సలో ఉన్నాడని అంటున్నారు. ఇవి కాక ఆయన కాలికి కూడా కొన్ని సమస్యలు రావడంతో నడవడం చాలా ఇబ్బందిగా మారిందని అంటున్నారు.
ఈ క్రమంలోనే చెన్నైలోని వడపళనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో ఈ రోజు ఉదయం (అక్టోబర్ 29, 2022) నాడు మరణించాడు. రఘురామ్ ఇక లేరనే వార్త విని ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు, దర్శకులు, సంగీత దర్శకులు, గీత రచయితలు, సినీ పరిశ్రమలో ఆయనకు తెలిసిన ప్రతి ఒక్కరూ షాక్‌కు గురయ్యారు అంతేకాక తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రేమ్‌జీ ప్రధాన పాత్రలో దర్శకుడు సురేష్ సంగయ్య చేస్తున్న త్రం సత్య సోతానైకి సినిమాకు కూడా సంగీతం అందించారు. అంతే కాకుండా, అతను కొన్ని మ్యూజిక్ ఆల్బమ్‌లు కూడా రఘురామ్ చేశారని, అంతేకాక సినిమా పరిశ్రమలోని ఇతర సంగీత స్వరకర్తలకు కూడా మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా పనిచేశాడని అంటున్నారు. సినీ పరిశ్రమలో మ్యూజిక్ ప్రోగ్రామర్‌గా పని చేయడంతో పాటు, రఘురామ్ మూడు తమిళ చిత్రాలకు సంగీతం అందించారు, అవి – 2017లో ఒరు కిదయిన్ కరుణై మను, 2011లో రివైండ్ , ఆసై, ఆయన నాలుగో సినిమా సత్య సోతానైకి రిలీజ్ కావాల్సి ఉంది.
Also Read: NBK 107 Vs Chiru 154 : ‘వీరయ్య’ను లేపారా? ఇద్దరు హీరోలున్నా బాలయ్య జోరుకు బేజార్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook