South Korea Halloween stampede: హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట.. 149 మంది మృత్యువాత..

South Korea Halloween stampede: దక్షిణ కొరియాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 149 మంది దుర్మరణం చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2022, 06:52 AM IST
South Korea Halloween stampede: హాలోవీన్‌ వేడుకల్లో తొక్కిసలాట.. 149 మంది మృత్యువాత..

South Korea Halloween stampede: హాలోవీన్‌ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శనివారం రాత్రి పెద్ద సంఖ్యలో ప్రజలు ఒక ఇరుకైన వీధి గుండా వెళ్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 149 మంది వరకు మరణించగా... 150 మంది వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని.. ఎందుకంటే గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సియోల్ యోంగ్సన్ అగ్నిమాపక విభాగం చీఫ్ చోయ్ సియోంగ్-బీమ్ తెలిపారు. ఇందులో ఎక్కువ మంది గుండెపోటుు గురైనట్లుగా తెలుస్తోంది. వందలాది షాప్స్, పార్టీ స్థలాలను కలిగి ఉన్న మెగాసిటీ యొక్క సెంట్రల్ జిల్లా ఇటావాన్‌లో శనివారం రాత్రి సుమారు 1 లక్ష మంది ప్రజలు గుమిగూడినట్లు స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి.

ఘటనాస్థలికి 140కి పైగా అంబులెన్సులను పంపించినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. గాయపడిన వారికి త్వరితగతిన చికిత్స అందించాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా ఫెస్టివల్ జరిగే ప్రదేశాల భద్రతను సమీక్షించాలని అధికారులకు పిలుపునిచ్చారు. కొవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు పాటు వాయిదా వేసిన వేడుకలను ఈ ఏడాది నిర్వహిస్తున్నారు.  స్థానికంగా ఉన్న బార్‌కు ఒక సినీతార వచ్చారనే విషయం తెలుసుకున్న ప్రజలు  ఒకేసారి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మృతుల్లో ఎక్కువ మంది 20 ఏళ్లలోపు వారుగా తెలుస్తోంది. 

Also Read: Philippines: ఫిలిప్పీన్స్ లో తుపాను భీభత్సం.. కొండచరియలు విరిగిపడి 42 మంది దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News