Dinesh Karthik Injury: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!

Dinesh Karthik Injury Big Scare for Team India. టీ20 ప్రపంచకప్ 2022లో తొలి ఓటమిని చవిచూసిన టీమిండియాకు భారీ షాక్ తగలనుంది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 31, 2022, 12:45 PM IST
  • ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్
  • స్టార్ ప్లేయర్ ఔట్
  • బంగ్లాపై మ్యాచ్ ఆడటం కష్టమే
Dinesh Karthik Injury: ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు భారీ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!

Dinesh Karthik likely to miss Bangladesh match due to Injury in T20 World Cup 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో తొలి ఓటమిని చవిచూసిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ దినేశ్ కార్తీక్ గాయంతో జట్టుకు దూరమయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వెన్ను గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో బుధవారం (నవంబర్ 2) జరిగే మ్యాచ్‌‌లో డీకే ఆడటం అనుమానంగా మారింది. కార్తీక్ గాయంపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. డీకే బంగ్లాపై మ్యాచ్ ఆడటం కష్టమేనని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం సాయంత్రం సూపర్ 12 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచులో ప్రొటీస్ విజయం సాధించింది. ఈ మ్యాచులోనే టీమిండియా వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ గాయపడ్డాడు. పెర్త్ పిచ్.. బౌన్స్ పిచ్ కావడంతో బంతి  బాగా పైకి వచ్చింది. ఒక్కోసారి కీపర్‌కు కూడా అందనంత ఎత్తులోకి వచ్చింది. ఈ క్రమంలోనే చాలా ఎత్తులో వచ్చిన ఓ బంతిని అందుకునే ప్రయత్నంలో కార్తీక్ పక్కటెముకలు పట్టేసాయి. దాంతో నొప్పితో డీకే మైదానంలో విలవిలలాడిపోయాడు. 

టీమిండియా ఫిజియో వచ్చి దినేశ్ కార్తీక్‌కు ప్రథమ చికిత్స చేసినా.. లాభ లేకపోయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో కార్తీక్ ఇబ్బందిగా నడుచుకుంటూ మైదానం వీడాడు. 15వ ఓవర్ తర్వాత రిషబ్ పంత్ మైదానంలోకి వచ్చి కీపింగ్ చేశాడు. డీకే గాయం తీవ్రతపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేకున్నా.. తదుపరి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండడని ఓ జాతీయ మీడియా తెలిపింది. కార్తీక్ గాయంపై క్లారిటీ లేదని మ్యాచ్ అనంతరం భువనేశ్వర్ కుమార్‌ కూడా చెప్పాడు.

టీ20 ప్రపంచకప్ 2022లో దినేశ్ కార్తీక్ ఆశించిన మేర రాణించట్లేదు. దాయాది పాకిస్తాన్ జట్టుపై కీలక సమయంలో పెవిలియన్ చేరి మ్యాచును సగదిగ్ధంలో పడేశాడు. ఇక దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి 52 పరుగుల భాగస్వామ్యాన్ని అందించినా.. అందులో అతడు చేసింది 6 పరుగులు మాత్రమే. బ్యాటింగ్ అవకాశం వచ్చిన రెండు మ్యాచ్‌ల్లో డీకే విఫలమవ్వడం, గాయం కారణంగా అతడిని పక్కనపెట్టే అవకాశం లేకపోలేదు. ఇదే జరిగితే రిషబ్ పంత్ తుది జట్టులోకి వస్తాడు. 

Also Read: Mrunal Thakur Saree Photos: బ్లాక్ శారీతో హీటు పెంచేస్తున్న మృణాల్ ఠాకూర్.. లేటెస్ట్ ఫోటోలు చూశారా?

Also Read: వైశాలి ఠక్కర్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఆ మూడో ఫోన్లోనే అసలు గుట్టు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News