Pathaan telugu Teaser : పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా పఠాన్.. అదరగొట్టేసిన షారుఖ్

Pathaan telugu Teaser షారుఖ్ నటించిన పఠాన్ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. పఠాన్ మూవీ టీజర్‌ను అన్ని భాషల్లో విడుదల చేశారు మేకర్లు. ఈ మూవీలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2022, 12:23 PM IST
  • షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్
  • పఠాన్ మూవీ టీజర్ రిలీజ్
  • అదరగొట్టేసిన బాలీవుడ్ బాద్ షా
Pathaan telugu Teaser : పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా పఠాన్.. అదరగొట్టేసిన షారుఖ్

Shah Rukh Khan Pathaan telugu Teaser : బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ల సందడి మొదలైంది. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపిక పదుకొణెల కాంబోలో సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం పఠాన్. ఈ మూవీని యశో చోప్రా బ్యానర్ మీద.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అసలే షారుఖ్ ఖాన్ సినిమాలేవీ థియేటర్లో ఆడటం లేదు. బిగ్గెస్ట్ డిజాస్టర్ల లిస్ట్‌లోకి వచ్చేస్తాయి. చివరగా జీరో అనే సినిమాను ఐదారేళ్ల క్రితం తీశాడు. దాంతో షారుఖ్ నిజంగానే జీరో అయ్యాడు. అప్పటి నుంచి షారుఖ్ సినిమాల్లో నటించడం మానేశాడు. మధ్యలో కొన్ని సినిమాలు నిర్మించాడు. కానీ అవి కూడా బెడిసి కొట్టేశాయి.

 

అందుకే ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు వరుస చిత్రాలతో రాబోతోన్నాడు. అట్లీతో ఒక సినిమా, రాజ్ కుమార్ హిరానీతో మరో సినిమా, సిద్దార్థ్ ఆనంద్‌తో ఇంకో సినిమా తీస్తున్నాడు. ఈ మూడు చిత్రాలతో షారుఖ్ ఖాన్ సందడి చేయబోతోన్నాడు. షారుఖ్ బర్త్ డే సందర్భంగా ఇప్పుడు పఠాన్ సినిమా నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

ఇందులో షారుఖ్ ఓ ఏజెంట్‌లా కనిపించబోతోన్నాడు. మూడేళ్ల నుంచి ఎక్కడున్నాడో తెలియని పఠాన్.. చివరకు మళ్లీ ఓ మిషన్ కోసం తిరిగి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించినట్టు అనిపిస్తోంది.ఇక దీపిక పదుకొణె అందాలు, యాక్షన్ సీక్వెన్స్‌ అదిరిపోయాయి. షారుఖ్ ఖాన్ పూర్తి యాక్షన్ హీరోగా ఇందులో విశ్వరూపం చూపించేశాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. జనవరి 25న ఈ చిత్రం థియేటర్లో సందడి చేయనుంది.

Also Read : Hansika Motwani Husband : హన్సికకు కాబోయే భర్త ఇతడే.. బయటపెట్టేసిన బ్యూటీ  

Also Read : Bigg Boss Geetu - Sri Satya : ఊసరవెల్లి గీతూ.. ఎగిరిపడుతున్న సత్య.. ఈ వారం మూడేది ఎవరికి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News