Dates Benefits: మగవారి సంతాన సాఫల్యతకు అద్భుత ఔషధం ఖర్జూరం

Dates Benefits: ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం ఖర్జూరం. ఎడారి ప్రాంతాల్లో లభించే ఈ ఫ్రూట్‌తో అన్ని సమస్యలకు తక్షణ పరిష్కారముందంటున్నారు వైద్య నిపుణులు.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 5, 2022, 11:58 PM IST
Dates Benefits: మగవారి సంతాన సాఫల్యతకు అద్భుత ఔషధం ఖర్జూరం

ఖర్జూరం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదొక హ్రై ప్రోటీన్డ్ ఫ్రూట్. ఖర్జూరంతో అన్ని రోగాలు నయమవుతాయని వైద్య నిపుణులు చెబుతారు. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఖర్జూరాన్ని మించింది లేనేలేదు. ముఖ్యంగా మగవారికి ఖర్దూరం పండ్లు ప్రత్యేక లాభాన్ని కల్గిస్తాయి.

ఖర్జూరంలో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్త హీనత సమస్య లేదా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే..తీవ్రమైన అలసట వస్తుంటుంది. ఇందులో ఐరన్, ఫైబర్ పెద్దమొత్తంలో ఉంటాయి. పరగడుపున ప్రతిరోజూ ఖర్జూరం తీసుకుంటే ఇందులో ఉండే పోషక పదార్ధాలు శరీరంలో పూర్తిగా జీర్ణమౌతాయి. ఫలితంగా అన్ని సమస్యలు దూరమౌతాయి. ఖర్జూరం పండ్లు డయాబెటిస్ పేషెంట్లు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన షుగర్‌తో కూడుకున్నది. అందుకే ఆరోగ్యానికి ఏ విధమైన హాని చేకూర్చదు. తీపి పదార్ధాలకు దూరంగా ఉండేవారు కూడా ఖర్జూరం తీసుకుంటే మంచిదంటున్నారు వైద్య నిపుణులు. రోజుకు రెండు ఖర్జూరం పండ్లు తింటే..శరీరానికి ఎనర్జీ పుష్కలంగా లభిస్తుంది. 

రోజూ పరగడుపున ఖర్జూరం

ఖర్జూరమనేది శరీరంలో హిమోగ్లోబిన్ పెంచి.ఎనీమియా సమస్యను దూరం చేస్తుంది. ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున..మలబద్ధకం సమస్య దూరమౌతుంది. జీర్ణక్రియ కూడా సజావుగా సాగుతుంది. ఇక స్థూలకాయం సమస్యకు పరిష్కారం కూడా ఖర్జూరమే. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి కావల్సిన పోషక పదార్ధాలు లభించడమే కాకుండా ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు నియంత్రణకు సాధ్యమౌతుంది. 

ఖర్జూరం బ్లడ్ సర్క్యులేషన్‌కు దోహదపడుతుంది. ఇందులో ఉండే ఐరన్ రక్తహీనతను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది.

మగవారి సామర్ధ్యాన్ని పెంచేదిగా ఖర్జూరం

ఖర్జూరంతో మగవారిలో ఉండే సంతాన సాఫల్యత సామర్ధ్యం పెరుగుతుంది. అంటే మగవారిలో సంతాన సాఫల్యత లేకపోవడానికి ప్రధాన కారణం స్పెర్మ్ కౌంట్ లేదా స్పెర్మ్ మొటిలిటీ. ఈ రెండూ ఖర్జూరం ద్వారా మెరుగుపడతాయి. ప్రతిరోజూ పాలతో కలిపి ఖర్జూరం తీసుకుంటే మగవారిలో ఫెటిలిటీ పెరుగుతుంది. రోజూ 2-3 ఖర్జూరం పండ్లు పాలలో ఉడికించి తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలతో పాటు స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. 

Also read; Health Tips: రక్తం లోపముంటే..ఈ పదార్ధాలు తింటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News