Suryakumar Yadav: క్రికెట్‌లో 'మిస్టర్‌ 360' అతడే.. నేను కేవలం..: సూర్యకుమార్‌

T20 World Cup 2022, Mr 360 AB de Villiers praises Suryakumar Yadav. తనను ఏబీ డివిలియర్స్‌తో పోల్చడంపై టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ స్పందించాడు.  

Written by - P Sampath Kumar | Last Updated : Nov 7, 2022, 05:10 PM IST
  • క్రికెట్‌లో 'మిస్టర్‌ 360' అతడే
  • నేను కేవలం ఏబీడీలా ఆడుతా
  • 25 బంతుల్లో 61 పరుగులు
Suryakumar Yadav: క్రికెట్‌లో 'మిస్టర్‌ 360' అతడే.. నేను కేవలం..: సూర్యకుమార్‌

Suryakumar Yadav says AB de Villiers is only one Mr 360: టీ20 ప్రపంచకప్‌ 2022లో టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ ఆరడగొడుతున్నాడు. తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపిస్తూ.. బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. సూపర్ 12లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో సూర్యకుమార్‌ 225 పరుగులు చేశాడు. ప్రస్తుతం సూర్య తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో విభిన్నమైన షాట్లతో మైదానం నలువైపులా పరుగులు చేస్తున్న సూర్యను ప్రతి ఒక్కరు 'మిస్టర్ 360' అని అంటున్నారు. తనను ఏబీ డివిలియర్స్‌తో పోల్చడంపై సూర్యకుమార్‌ స్పందించాడు. 

క్రికెట్‌లో ‘మిస్టర్‌ 360’ ఒకే ఒక్కడని సూర్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. 'క్రికెట్‌లో మిస్టర్‌ 360 ఒకే ఒక్కడు. అతడే ఏబీ డివిలియర్స్‌. నేను కేవలం ఏబీడీలా ఆడేందుకు ప్రయత్నిస్తా' అని సూర్య పేర్కొన్నాడు. సూర్యకుమార్‌ వ్యాఖ్యలపై డివిలియర్స్‌ స్పందించాడు. 'సూర్యకుమార్‌.. నువ్ చాలా త్వరగా ఉన్నత స్థానాలకు చేరుకొన్నావు. ఊహించిన దానికంటే ఎక్కువగా రాణిస్తున్నావు. జింబాబ్వేపై అత్యుత్తమంగా ఆడావు' అని ఏబీడీ ట్వీట్‌ చేశాడు. 

టీ20 ప్రపంచకప్‌ 2022లో భాగంగా సూపర్ 12 దశలో జింబాబ్వేతో జరిగిన చివరి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 25 బంతుల్లో 61 పరుగులు చేశాడు. విభిన్నమైన షాట్లతో జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. క్రీజ్ వదిలి మరీ లెగ్ సైడ్, వికెట్స్ వెనకాల కొట్టిన షాట్లకు అందరూ షాక్ అయ్యారు. సూర్య బ్యాటింగ్ కారణంగా భారత్ భారీ స్కోర్ చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. సూర్యపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఏబీ డివిలియర్స్‌ను మరిపిస్తున్నాడని మాజీలు, ఫాన్స్  కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీకి అరుదైన అవార్డు.. కెరీర్‌లోనే తొలిసారి!

Also  Read: T20 World Cup 2022 టాప్‌ రన్‌ స్కోరర్స్, హైయెస్ట్ వికెట్ టేకర్స్ వీరే.. భారత్ నుంచి ఒక్కరు లేరు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News