అనునిత్యం ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యలకు పరిష్కారం కోసం వైద్యుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ప్రతి వంటింట్లో తప్పకుండా లభించే వస్తువులతో చెక్ చెప్పవచ్చు. అలాంటివాటిలో ముఖ్యమైనవి మెంతులు.
మెంతుల్ని ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయి. అదే రాత్రి వేళ మెంతి గింజల్ని పాలలో ఉడకబెట్టి లేదా మెంతి పౌడర్ పాలలో కలిపి తాగితే కలిగే ప్రయోజనాలు చాలా ఎక్కువ. మెంతుల్ని సహజంగా వంటల్లో మసాలా దినుసుల్లా వినియోగిస్తారు. ఇంకొంతమంది ఉదయం వేళ పరగడుపున మెంతి నీరు తాగుతుంటారు. మెంతులతో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అందుకే మెంతుల్ని ఏ రూపంలో తీసుకున్నా ఫరవాలేదు. పాలలో మెంతి పౌడర్ కలుపుకుని తాగితే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
పాలలో మెంతి పౌడర్ కలిపి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
సుఖమైన నిద్ర
ఒకవేళ నిద్రలేమి సమస్య ఉంటే..మీరు రాత్రి వేళ పాలలో మెంతి పౌడర్ కలుపుకుని తాగితే అద్భుత ప్రయోజనాలుంటాయి. మంచి సుఖమైన నిద్ర పడుతుంది.
శరీరానికి పటిష్టత
మెంతుల్లో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. పాలలో విటమిన్స్, పలు పోషకాలుంటాయి. ఫలితంగా మీ ఎముకలు, జాయింట్స్, చిగుళ్లు పటిష్టంగా మారుతాయి. ప్రతిరోజూ పాలలో మెంతి పౌడర్ కలుపుకుని తాగడం వల్ల శరీరం అంతర్గతంగా పటిష్టమౌతుంది.
ఇమ్యూనిటీని పెంచుతుంది
శరీరం ఇమ్యూనిటీని పెంచేందుకు పాలు, మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా..జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యల్నించి ఉపశమనం కల్గిస్తుంది. అందుకే చలికాలంలో మెంతి పౌడర్‌ను పాలలో కలిపి తాగడం వల్ల చాలా లాభాలున్నాయి.
గుండెకు ఆరోగ్యం
మెంతి పౌడర్‌ను పాలలో కలిపి తాగడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మెంతులు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను గణనీయంగా తగ్గిస్తాయి. బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తాయి. మెంతి పౌడర్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం చాలా త్వరగా నియంత్రణలో ఉంటుంది. మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలకు మెంతుల్ని మించిన ఔషధం లేదంటారు.
Also read; Health Tips: ఛాతీలో నొప్పి సమస్యగా ఉందా..పొరపాటున కూడా నిర్లక్ష్యం చేయవద్దు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook