Tragedy in Egypt: ఈజిప్టులో విషాదం.. నైలు నది కాలువలో పడ్డ బస్సు... 21 మంది మృత్యువాత..

Tragedy in Egypt: ఈజిప్టులో విషాదం జరిగింది. నైలు నది డెల్టా కాలువలో బస్సు పడిపోయిన ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2022, 07:21 AM IST
Tragedy in Egypt: ఈజిప్టులో విషాదం.. నైలు నది కాలువలో పడ్డ బస్సు... 21 మంది మృత్యువాత..

Tragedy in Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ప్యాసింజర్ బస్సు నైలు నది డెల్టా కాలువలో పడిపోవడంతో 21 మంది చనిపోయారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారి డాక్టర్ షెరీఫ్ మకీన్ తెలిపారు. రాజధాని కైరోకు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల (62 మైళ్లు) దూరంలో ఉన్న దకాహ్లియా ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం జరిగిందని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన ప్రయాణీకులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహన డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చని మహమ్మద్‌ అబ్దెల్‌ హదీ అనే పోలీసు అధికారి తెలిపారు. 

ఈజిప్టులో ప్రతి సంవత్సరం ట్రాఫిక్ ప్రమాదాల వల్ల వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. అతివేగం, అధ్వాన్నమైన రోడ్లు లేదా ట్రాఫిక్ చట్టాలను సరిగా అమలు చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గత జూలైలో మిన్యా దక్షిణ ప్రావిన్స్‌లోని హైవేపై ఆగి ఉన్న ట్రైలర్ ట్రక్కును ప్రయాణీకుల బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 23 మంది మృత్యువాత పడగా.. 30 మంది గాయపడ్డారు. అక్టోబర్‌లో డకాహ్లియాలో మినీబస్సును ట్రక్కు ఢీకొట్టిన ఘటనలో కనీసం పది మంది మరణించారని అధికారులు తెలిపారు.  

Also read: World Population: మరో 2 రోజుల్లో 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News