Shahrukh Khan And Team Was Not Stopped At Mumbai Airport: గత శనివారం షారుక్ ఖాన్ అలాగే ఆయన టీమ్ మొత్తాన్ని కస్టమ్స్ అధికారులు ముంబై విమానాశ్రయంలో ఆపినట్లు వార్తలు వచ్చాయి. షారుఖ్ ఖాన్, ఆయన మేనేజర్ పూజా దద్లానీ, అలాగే షారుక్ ఖాన్ సహా బాడీగార్డ్ రవి సింగ్ షార్జా బుక్ ఫెయిర్‌లో పాల్గొని తిరిగి ముంబైకి వచ్చారు. అయితే వారిని బయటకు రానివ్వవాలేదని షారుఖ్ ఖాన్, సహా ఆయన టీమ్ మొత్తాన్ని కస్టమ్స్ అధికారులు విమానాశ్రయంలో ఆపారని వార్తలు వచ్చాయి. ఆయన అలాగే ఆయన టీమ్ మెంబర్స్ వద్ద ఖరీదైన గడియారాలు ఉన్నాయి, వాటిని వారంతా యుఎఇ నుండి తీసుకువచ్చారని వార్తలు వచ్చాయి.
వాటికి ఎలాంటి టాక్స్ లు కట్టకపోవడంతో విమానాశ్రయంలో షారుఖ్ నుంచి కస్టమ్ డ్యూటీ వసూలు చేశారని సుమారు ఏడు లక్షల దాకా అమౌంట్ ను కట్టిన తర్వాతే వాటిని విడుదల చేశారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్తలకు సంబంధించిన పూర్తి నిజాలు బయటకు వచ్చాయి. ఈ విషయాన్ని కస్టమ్స్ అధికారులు స్వయంగా వెల్లడించారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన కస్టమ్స్ అధికారి షారుక్ నుంచి కానీ ఆయన టీమ్ నుంచి కానీ ఎటువంటి జరిమానా తీసుకోలేదని కస్టమ్స్ అధికారి వెల్లడించారు.
వారు తీసుకొచ్చిన వస్తువులపై మాత్రమే సుంకం చెల్లించాలని షారుక్ అలాగే ఆయన టీమ్ నుంచి కోరినట్లు అధికారి తెలిపారు. వారి నుంచి ఫైన్ వసూలు చేసినట్లు మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాడనై, మేం ఎలాంటి జరిమానా వసూలు చేయలేదు. ఇదంతా అబద్ధమని అన్నారు. ప్రైవేట్ జీఏ టెర్మినల్ నుంచి టీ2 టెర్మినల్‌కు షారూఖ్ బాడీగార్డ్‌ను ఎందుకు తీసుకెళ్లారని కస్టమ్ అధికారిని అడగగా దానికి ఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, ప్రయాణీకులను డ్యూటీ లేదా అలాంటి ఏదైనా రుసుము చెల్లించమని అడిగినప్పుడు, ప్రయాణీకులకు సౌకర్యాలు ఉన్నందున అతన్ని GA టెర్మినల్ నుండి T2 టెర్మినల్‌కు తీసుకువెళతారని చెప్పారు. షారూఖ్ అలాగే ఆయన టీమ్ యాపిల్ వాచ్ మరియు వాచ్ విండర్ కేస్‌ని తీసుకువెళుతున్నట్లు కూడా అధికారి వెల్లడించారు. మొదట చెప్పినట్లుగా ఆయన అన్ని ఖరీదైన వాచీలను తీసుకెళ్లలేదని, షారుఖ్ అందుకున్న ఖరీదైన బహుమతుల ఖరీదు 17.86 లక్షల రూపాయలు అని కూడా ఆయన ఆయన చెప్పారు.
Also Read: Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?
Also Read: Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు షాకింగ్ న్యూస్..ఆ సినిమాలు ఇక లేనట్టే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook