Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?

Allu Arjun Fans Blunder Mistake: పుష్ప 2 అప్డేట్ కావాలంటూ గీతా ఆర్ట్స్ బ్యానర్ ముందు నిరసనకు దిగారని వార్తలు వస్తున్న నేపథ్యంలో వారు పప్పులో కాలేసినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 13, 2022, 08:10 PM IST
Allu Arjun Fans Blunder : పప్పులో కాలేసిన అల్లు అర్జున్ ఫాన్స్.. ఆ లాజిక్ ఎలా మిస్సయ్యారు భయ్యా?

Allu Arjun Fans Blunder Mistake: అల్లు అర్జున్ ఫ్యాన్స్ పప్పులో కాలేశారు. అవును నిజమే మీరు వింటున్నది కరెక్టే. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ హీరోగా నటించడం పుష్ప 2 సినిమాకు సంబంధించిన అప్డేట్ రిలీజ్ చేయాలి అంటూ కొందరు అల్లు అల్లు అర్జున్ అభిమానులు అల్లు ఆర్మీ పేరుతో హైదరాబాదులోని గీతా ఆర్ట్స్ బిల్డింగ్ ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. వీలైనంత త్వరగా పుష్ప 2 నుంచి అప్డేట్ రిలీజ్ చేయాలని వారంతా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పుష్ప 1 రిలీజ్ అయ్యి డిసెంబర్ నెలలకు సంవత్సరం కావస్తున్న పుష్ప 2 గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ లోనే కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు విజయవాడ, విశాఖపట్నం లాంటి చోట్ల కూడా నిరసన ప్రదర్శనలు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మిస్సయిన లాజిక్ ఏమిటంటే గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కుమారుడు అనే లింక్ తప్ప పుష్ప 2 సినిమాకి గీత ఆర్ట్ సినిమా గీత ఆర్ట్స్ సంస్థకు ఎలాంటి సంబంధం లేదు. పుష్ప మొదటి భాగాన్ని మైత్రి మూవీ మేకర్స్ అల్లు అరవింద్ బంధువులు తో కలిసి నిర్మించారు. అయితే సెకండ్ పార్ట్ లో అల్లు అరవింద్ బంధువులు తప్పుకున్నారు మైత్రి మూవీ మేకర్ సంస్థతో కలిసి సుకుమార్ స్వయంగా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ నేపథ్యంలో పుష్ప నుంచి అప్డేట్ కావాలంటే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు కానీ సుకుమార్ ఆఫీస్ ముందు కానీ ధర్నా చేయాలి కానీ నేరుగా వెళ్లి గీత ఆర్ట్స్ ముందు ధర్నా చేయడం ఏమిటి అనే ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తున్నారు. మరి కొంతమంది అయితే ఇదంతా అల్లు అర్జున్ పీఆర్ టీమ్ పనే అని, వార్తల్లోకి వచ్చేందుకు ఇలా జిమ్మిక్కులు చేయడం వాళ్లకు కొత్త ఏమీ కాదని కామెంట్ చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఇంకా లేట్ చేస్తే మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేయడానికి మాకు ఎలాంటి ఇబ్బంది లేదని సమాధానం ఇస్తున్నారు. అయితే ఇటీవల ఊర్వశివో రాక్షసివో అనే సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్న నేపథ్యంలో దాన్ని సక్సెస్ మీట్ కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తన తమ్ముడికి ఎంతో కాలానికి హిట్ వచ్చిందని అల్లు అర్జున్ చాలా సంతోషపడ్డాడు. ఈ సంతోషంలోనే పుష్ప 2 అప్డేట్ అని చెబుతూ పుష్ప 1 తగ్గేదేలే పుష్ప 2 అసలు తగ్గేదేలే అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ అప్డేట్ గురించి కూడా అభిమానులు నిరాశ పాలైన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు కూడా లాజిక్ లేకుండా మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ ముందు కాకుండా గీత ఆర్ట్స్ ముందు ధర్నా చేయడం చర్చనీయాంశంగా మారింది. మరి దీన్ని అల్లు అర్జున్ టీం ఎలా కవర్ చేసుకుంటుందనేది చూడాల్సి ఉంది. 

Also Read: Changes in SSMB 28: పంతం పట్టిన మహేష్.. దెబ్బకు కథ మొత్తం మార్చేసిన గురూజీ!

Also Read:  Unstoppable with NBK 2: షోకి మరో మాజీ సీఎం.. మాజీ స్పీకర్..ఆహా వారి ప్లానింగ్ లేదుగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News