సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసు: శశిథరూర్‌కు కోర్టు సమన్లు

సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో విచారణకు హాజరు కావాలని ఆమె భర్త, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కోర్టు సమన్లు జారీ చేసింది.

Last Updated : Jun 5, 2018, 07:38 PM IST
సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసు: శశిథరూర్‌కు కోర్టు సమన్లు

సునంద పుష్కర్‌ అనుమానాస్పద మృతి కేసులో విచారణకు హాజరు కావాలని ఆమె భర్త, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌కు ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు కోర్టు సమన్లు జారీ చేసింది. జూలై 7న విచారణకు హాజరు కావాలని శశిథరూర్‌ను కోర్టు ఆదేశించింది. ఈమేరకు పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటును విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు.. జులై 7న కోర్టుకు రావలసిందిగా థరూర్‌ను ఆదేశించింది. థరూర్‌కు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు.

 

సునంద పుష్కర్‌‌ను ఆత్మహత్యకు ప్రేరేపించడం, అనారోగ్యంతో ఉన్న భార్య పట్ల అమానుషంగా వ్యవహరించినట్లు థరూర్‌పై ఆరోపణలు ఉన్నాయి. మూడు వేల పేజీల చార్జిషీటును మొత్తం పరిశీలించినట్లు, సునందను థరూర్ ఆత్మహత్యకు ప్రేరేపించడం, వేధించిన నేరాల కింద ఆయనను విచారించాలని నిర్ణయించినట్లు జడ్జి పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునంద పుష్కర్ రాసిన ఓ కవితను చార్జిషీటు దాఖలు సందర్భంగా ఢిల్లీ పోలీసులు కోర్టు ముందు ఉంచారు.

51 ఏళ్ల సునంద పుష్కర్‌, పాకిస్థానీ జర్నలిస్టుతో సంబంధాలు పెట్టుకున్న తన భర్తపై బహిరంగంగా ఆరోపణలు చేసిన కొన్ని రోజులకు జనవరి 17, 2014 రాత్రి న్యూఢిల్లీలోని లీలా హోటల్లో చనిపోయారు.

Trending News