Tollywood Director Madan Passed Away: సూపర్ స్టార్ కృష్ణ మరణంతో విషాదంలో మునిగిపోయిన టాలీవుడ్ ఆ విషాదం నుంచి కోలుకోకుండానే మరోసారి తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తెలుగులో అనేక సినిమాలుకు దర్శకుడిగా వ్యవహరించిన మదన్ హఠాన్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం దర్శకుడు మదన్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది.
అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయనతో విశ్వాస విడిచినట్లుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టి పెరిగిన ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తన విద్య పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలు ఆడటం లో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆయన తర్వాత సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ మకాం మార్చారు.
అసిస్టెంట్ కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర పనిచేసిన ఆయన తర్వాత కొన్ని సినిమాలకు సహ రచయితగా వ్యవహరించారు. తెలుగులో ఆ నలుగురు అనే సినిమాతో ఆయన మొదటి సారిగా ప్రేక్షక లోకానికి పరిచయం అయ్యారు. ఈ సినిమా ఇప్పటికీ అనేకమందికి ఫేవరెట్ ఫిలింగా ఉంటుంది. ఆ సినిమాకి ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు.
తర్వాత పెళ్లయిన కొత్తలో అనే సినిమాతో దర్శకుడుగా మారిన ఆయన గుండె జల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి అనే సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. మోహన్ బాబుతో తీసిన గాయత్రి సినిమా మదన్ కు చివరి సినిమా. ఆ తరువాత ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఇక ఆయన అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి వివరాలైతే ప్రస్తుతానికి అందుబాటులో లేవు.
Also Read: NBK 108: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్, హీరోయిన్.. డిసెంబర్ 8న గ్రాండ్ ఓపెనింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook