HanuMan Teaser : హనుమాన్ టీజర్.. ఆదిపురుష్‌కు తిట్లు.. విజువల్ వండర్

Prasanth Varma Hanuman Teaser ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కలిసి హనుమాన్ సినిమాతో మరోసారి అందరినీ మెప్పించేందుకు రాబోతోన్నారు. హనుమాన్ టీజర్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 21, 2022, 04:01 PM IST
  • ఆశ్చర్యపరుస్తున్న హనుమాన్ టీజర్
  • ఆదిపురుష్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
  • విజువల్ వండర్‌గా హనుమాన్
HanuMan Teaser : హనుమాన్ టీజర్.. ఆదిపురుష్‌కు తిట్లు.. విజువల్ వండర్

Adipurush Teaser VFX Vs Hanuman Teaser : ప్రభాస్ ఓం రౌత్ ఆదిపురుష్‌ సినిమాకు పెట్టిన బడ్జెట్ దాదాపు ఐదు వందల కోట్లు. దాని రిజల్ట్ ఎలా ఉండోబోతోందో చిన్న టీజర్ ద్వారా చూపించారు. ఆ టీజర్‌ను కొంప కొల్లేరు చేసింది. టీజర్‌ను చూసి ప్రతీ ఒక్కరూ విజువల్స్, వీఎఫ్‌ఎక్స్‌ను ఏకిపారేశారు. రాముడు, రావణుడు, ఆంజనేయుడు, వానర సైన్యం ఇలా ఉంటుందా? అంటూ పాయింట్ పాయింట్‌ను ట్రోల్స్ చేశారు.  ఈదెబ్బతో ఓం రౌత్ మళ్లీ రిపేర్లు చేసేందుకు పూనుకున్నాడు. దాదాపు వంద కోట్లతో ఆదిపురుష్‌ను మళ్లీ రిపేర్లు చేస్తున్నాడట.

అయితే ఇప్పుడు మళ్లీ ఆదిపురుష్‌ టాపిక్ ఎందుకు వచ్చిందనే అనుమానం అందరికీ వచ్చి ఉంటుంది. కానీ హనుమాన్ టీజర్ చూశాక.. మన తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎక్కడున్నాడు.. ఏ స్థాయిలో విజువలైజ్ చేసుకున్నాడు..ఆ హిందీ డైరెక్టర్ ఏం ఆలోచించాడు.. ఏం తీశాడు అన్నది అనుమానంగా మారుతుంది. హనుమాన్ టీజర్ విజువల్ వండర్‌గా అనిపిస్తుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News