Naga Chaitanya Birthday : నీకు ప్రశాంతత దక్కాలి!.. చైతూకి వెంకీ మామ స్పెషల్ విషెస్

Naga Chaitanya Birthday నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో అక్కినేని అభిమానులు సందడి చేస్తున్నారు. తాజాగా వెంకీమామ తన అల్లుడికి ప్రత్యేకంగా విషెస్ అందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 03:35 PM IST
  • నాగ చైతన్య పుట్టిన రోజు
  • సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సందడి
  • వెంకీ మామ విషెస్ వైరల్
Naga Chaitanya Birthday : నీకు ప్రశాంతత దక్కాలి!.. చైతూకి వెంకీ మామ స్పెషల్ విషెస్

Venkatesh Daggubati - Naga Chaitanya Birthday : నాగ చైతన్య బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా సోషల్ మీడియా అక్కినేని అభిమానుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక నాగ చైతన్య కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో కలిసి నాగ చైతన్య చేస్తోన్న ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ మూవీ టైటిల్‌తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. NC22 ప్రాజెక్ట్ టైటిల్ పేరుని కస్టడీ (Custody)గా ఫిక్స్ చేశారు.

 

ఈ మేరకు వదిలిన కస్టడీ ఫస్ట్ లుక్‌ పోస్టర్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. ఇవన్నీ ఇలా ఉంటే.. నాగ చైతన్యకు సెలెబ్రిటీల విషెస్, అభిమానుల శుభాకాంక్షలతో ట్విట్టర్ మార్మోగిపోతోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. తన మేనల్లుడి బర్త్ డే సందర్భంగా వెంకటేష్ విషెస్ అందించాడు.

హ్యాపీ బర్త్ డే రా చైతూ.. ఈ ఏడాది నీకు ప్రశాంతత దక్కాలి.. సంతోషం నీ దరికి చేరాలి.. ఈ ఏడదంతా బాగుండాలి అంటూ కోరుతూ ట్వీట్ వేశాడు. ఇక ఈ ట్వీట్‌ను చూసిన చైతూ అభిమానులు థాంక్స్ మామా అంటూ స్పందిస్తున్నారు. వెంకీ మామా సినిమాతో వెంకీ, చైతూలు హిట్ కొట్టేసిన సంగతి తెలిసిందే. సమంత అయితే నాగ చైతన్యకు గత ఏడాది విషెస్ అందించలేదు. ఇప్పుడు కూడా ఆమె స్పందించదని, విషెస్ చెప్పదనే అక్కినేని అభిమానులు అనుకుంటున్నారు. మరి సమంత రియాక్ట్ అవుతుందో లేదో అన్నది చూడాలి.

Also Read : Sudigali Sudheer Remuneration : గాలోడు సినిమాతో దశ తిరిగిందిగా.. సుధీర్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

Also Read : Rishab Shetty - Rashmika Mandanna : రష్మికకి అంత పొగరా?.. తిక్క తీర్చిన రిషభ్ శెట్టి.. వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News