Weight Gain Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా వేగంగా బరువు పెరగవచ్చు..

Weight Gain Diet Plan: బరువు పెరగడానికి తప్పకుండా డైట్‌లో పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాల్లో పెరుగు, రోటీ, అన్నం, కూరగాయలను తప్పనిసరి.    

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2022, 04:09 PM IST
Weight Gain Diet Plan: ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా వేగంగా బరువు పెరగవచ్చు..

Weight Gain Diet Plan: చాలా మంది ఫిట్‌గా కనిపించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తారు. బక్క పలచటి శరీరాన్ని దృఢంగా తయారు చేసుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ శరీర బరువును తగ్గించుకోవడం ఎంత కష్టమే దానిని పెంచుకోవడం కూడా అంతే కష్టమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా తయారు చేసుకోవడానికి తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు పెరగడానికి డైట్ ప్లాన్‌ని కూడా అనుసరించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి ఆహారాలను తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారో ఇప్పుడు తెలుసుకుందాం..

 బరువు పెరగడానికి ఉదయాన్నే నిద్రలేచి.. ఖాళీ కడుపుతో బెల్లం నీటిని తాగితే సులభంగా ఫలితాలు పొందుతారు. అందుకోసం గ్లాసులో కాస్త బెల్లం వేసి, ఆ తర్వాత ఉదయాన్నే లేచి తాగాలి. అంతేకాకుండా ఈ నీటితో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, బనానా షేక్, మిల్క్ షేక్, బాదం షేక్ మొదలైన వాటిని తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

అల్పాహారం:
బరువు పెరగాలకునేవారు అస్సలు తీసుకునే ఆహారాలను మానుకోవద్దని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అల్పాహారంలో పాలు, గంజి, గుడ్డు, గ్రాము, మొలకలు, మిల్క్ ఓట్స్, వేరుశెనగ వెన్న, పాన్‌కేక్‌లను తినవచ్చు. బరుపు పెరగాలనుకునేవారు ఉ 8:00 నుంచి 9:00 వరకు అల్పాహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

నాన్ వెజ్ లంచ్:
బరువు పెరగడానికి తప్పకుండా ఆహారాల్లో మటన్ లేదా చేపలను తినాల్సి ఉంటుంది. శాఖాహారులైతే పప్పు, పెరుగు, రోటీ, అన్నం, కూరగాయలను సలాడ్స్‌లో తినాలి.  బరువు పెరగడానికి పూర్తి కొవ్వు పాలు తాగాల్సి ఉంటుంది.

బరువు పెరగాలనుకునేవారు తప్పకుండా పడుకునేదాని కంటే రెండు మూడు గంటల ముందు డిన్నర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా డిన్నర్‌లో తేలిక పాటి ఆహారాలు తీసుకుంటే సులభంగా బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా పడుకునే క్రమంలో పాలతో పాటు ఖర్జూరం, బాదం, ఎండుద్రాక్ష, వాల్‌నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

(NOTE: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

 

Also Read : Bihar Road accident: భక్తులపైకి దూసుకొచ్చిన ట్రక్కు... 12 మంది దుర్మరణం..

Also Read : Telangana: అయ్యప్ప పూజకు వెళ్లి వస్తుండగా ట్రాక్టర్‌ను ఢీకొట్టిన లారీ... ఐదుగురు దుర్మరణం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News