Student Arrested For Recording Girls Semi Nude Videos: చండీఘడ్ యూనివర్శిటీలో గాళ్స్ హాస్టల్లో బాత్రూమ్ వీడియో లీక్ అయిన ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అమ్మాయిలకు బయటే కాదు.. ఉన్నత చదువులు చదువుకునేందుకు వేదికలైన యూనివర్శిటీల్లోనూ రక్షణ కరువైందని చండీఘడ్ ఘటన నిరూపించింది. యావత్ దేశం ఈ ఘటనను ఇంకా మరువక ముందే తాజాగా అలాంటి దారుణమైన ఘటనే మరొకటి వెలుగుచూసింది.
ఈసారి కర్ణాటక రాజధాని బెంగళూరు నగరం ఈ కీచక పర్వానికి వేదికైంది. సౌత్ బెంగళూరులోని హోసకెరెహల్లిలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గాళ్స్ హాస్టల్ బాత్రూమ్ లో రహస్యంగా హిడెన్ కెమెరాను అమర్చిన శుభమ్ ఎం ఆజాద్ అనే స్టూడెంట్.. ఆ రహస్య కెమెరాతో 1200 లకుపైగా అర్ధనగ్న వీడియోలు, ఫోటోలు రికార్డ్ చేశాడు. ఇప్పటికే 1200 కుపైగా వీడియోలు, ఫోటోలు రికార్డు చేసిన ఆజాద్.. నవంబర్ 19న మరో రెస్ట్ రూమ్ లో మరో సీక్రెట్ కెమెరా అమర్చుతూ అడ్డంగా దొరికిపోయాడు.
విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆజాద్ పై గిరినగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆజాద్ ని పిలిచి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. అతడి ల్యాప్ టాప్ లో 1200 కుపైగా వీడియోలు, ఫోటోలు ఉండటం చూసి పోలీసులే షాకయ్యారు.
దీంతో నిందితుడి ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్‌తో పాటు అన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఇప్పటికే ఏమైనా విద్యార్థినుల ప్రైవేట్ వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ చేసి ఉంటాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
ఆజాద్ ఇలా అమ్మాయిలను అర్ధ నగ్నంగా చిత్రీకరిస్తూ పట్టుబడటం ఇదేం మొదటిసారి కాదు. నవంబర్ 13న సైతం ఆజాద్ ఇదే తప్పు చేస్తూ యూనివర్శిటీ మేనేజ్మెంట్ చేతికి చిక్కాడు. అయితే ఇలాంటి తప్పు మరొకసారి రిపీట్ చేయను అని హామీ ఇవ్వడంతో మేనేజ్మెంట్ వదిలేసింది. దీంతో తన వంకర బుద్ది పోనిచ్చుకోని స్టూడెంట్ మళ్లీ అదే పని చేస్తూ పట్టుబడి కటకటాల పాలయ్యాడు. అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న కాలేజీ స్టూడెంట్ ని కాలేజీ నుంచి తరిమేయడంతో పాటు అతడిని కఠినంగా శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
తమ పిల్లలకు కాలేజీ హాస్టల్లోనే రక్షణ ( Chandigarh University ) కరువైతే ఇక తమ పరిస్థితి ఏంటని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉన్నత చదువుల కోసం ఖర్చును లెక్కచేయకుండా తమ పిల్లలను కాలేజీలకు పంపిస్తే.. ఇలాంటి నీచులు వారి జీవితాలతో ఆడుకుంటున్నారని.. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక సర్కారు సైతం ఈ ఘటనను సీరియస్ గానే తీసుకుంది.
Also Read : Ragging In Odisha: ర్యాగింగ్ కేసులో కలకలం.. ఏకంగా 12 మంది డీటైన్?
Also Read : Husband Kills Wife: భార్యను చంపి, పూల మాలతో నివాళి అర్పించిన భర్త
Also Read : Bansuwada Woman Death: ఫేస్బుక్లో యువకుడితో ప్రేమ.. భర్తను వదిలి వెళ్లిపోయిన మహిళ.. ఊహించని షాక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook