ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టులో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొన్ని అంశాలపై స్టే ఇస్తూ ఏపీ ప్రభుత్వానికి ఊరట కల్గించగా..కీలకమైన అమరావతి రాజధాని అంశంపై మాత్రం స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ వివరాలు మీ కోసం..
ఏపీలో అమరావతి వర్సెస్ మూడు రాజధానుల అంశం రోజురోజుకూ కొత్త మలుపు తిరుగుతోంది. ఈ అంశమై ఇవాళ సుప్రీంకోర్టు నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కీలకమైన అమరావతి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇది ఏపీ ప్రభుత్వానికి ఊహించని పరిణామం. సుప్రీంకోర్టులో స్టే వస్తుందని ఆశించిన ప్రభుత్వానికి నిరాశే ఎదురైంది. అయితే కొన్ని అంశాల్లో మాత్రం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రభుత్వానికి కాస్త ఊరట కల్గించే పరిణామంగా ఉంది. కాల పరిమితిలోగా పూర్తి చేయాలనే అంశాలపై ఏపీ ప్రభుత్వానికి తక్షణం ఉపశమనం లభించింది.
ఏ అంశాలపై స్టే
కాలపరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టు ప్రభుత్వంలా ఎందుకు వ్యవహరిస్తోందని ప్రశ్నించిన హైకోర్టు..అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకరిస్తే ఎలా సాధ్యమంది. ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఎలా ఆదేశిస్తారని..హైకోర్టు ఏమైనా టౌన్ ప్లానరా అని ప్రశ్నించింది. హైకోర్టే ప్రభుత్వమైతే..ఇక కేబినెట్ ఎందుకని కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
అమరావతి కేపిటల్ ప్రాంతంలో ప్లాట్స్‌ను అభివృద్ది చేసిన ల్యాండ్ యజమానులకు గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మూడు నెలల్లోగా అప్పగించాలనే హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో కనీస మౌళిక సదుపాయాలు నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని..ఎలక్ట్రిసిటీ, రోడ్లు, డ్రైనేజ్ వంటి సౌకర్యాల్ని కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలపై కూడా సుప్రీంకోర్టు స్టే విధించింది.
అభివృద్ధి ఎలా చేయాలనేది నిర్ణయించేది రాష్ట్ర ప్రభుత్వమని..హైకోర్టు ఈ విషయంలో తన పరిధిని దాటిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజధాని ఒకే ప్రాంతంలో ఉండాలని ఒక రాష్ట్రాన్ని కోర్టు ఆదేశించజాలదని సుప్రీంకోర్టు తెలిపింది. మరోవైపు కేసు విచారణను 2023 జనవరి 31కు వాయిదా వేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
Also read: Kotamreddy Srinivasulu Reddy: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై దాడి.. ఎన్నో అనుమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook