Yashoda Movie: సమంత 'యశోద'కు లైన్ క్లియర్.. ఐదు కోట్ల దావా అందుకే!

Eva Hospital Withdraws Court Case: ఈవా అనే ఒక ఫెర్టిలిటీ హాస్పిటల్ తమ హాస్పిటల్ పేరును యశోద సినిమాలో తప్పుగా చిత్రీకరించారని చెబుతూ కోర్టులో కేసు వేసింది. తాజాగా ఈ అంశం మీద ఇరువర్గాల వారు రాజీకి వచ్చారు. ఆ వివరాలు 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 29, 2022, 03:03 PM IST
Yashoda Movie: సమంత 'యశోద'కు లైన్ క్లియర్.. ఐదు కోట్ల దావా అందుకే!

Yashoda Movie Team Compromises with Eva Hospital: కొద్ది రోజుల క్రితం సమంత హీరోయిన్ గా నటించిన యశోద మూవీ అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈవా అనే ఒక ఫెర్టిలిటీ హాస్పిటల్ తమ హాస్పిటల్ పేరును సినిమాలో తప్పుగా చిత్రీకరించారని చెబుతూ కోర్టులో కేసు వేసింది. దీంతో ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాని ఏమీ చేయలేని కోర్టు ఓటీటీలో విడుదల చేయకుండా కీలక నిర్ణయం తీసుకుంది. దానిమీద స్టే విధించడమే కాక కేసును డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది. ఇక తాజాగా ఈ విషయం మీద సినిమా టీం-ఈవా హాస్పిటల్ రాజీకి వచ్చారు.

తాజాగా ఈ అంశం మీద ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నిర్మాత  శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాలో ఈవా  అనే పేరు ఒక కాన్సెప్ట్ ప్రకారం పెట్టామని, వేరొకరి మనోభావాలు దెబ్బ తీయడానికి కాదని పేర్కొన్నారు. ఈవా వారిని కలిసి నేను జరిగింది చెప్పానని ఇకమీదట ఫ్యూచర్లో ఈవా  అనే పదం యశోద సినిమాలో కనపడదని ఆయన పేర్కొన్నారు. మా నిర్ణయాన్ని ఈవా సంస్థ కూడా అంగీకరించిందని ఈ సమస్య ఇంతటితో పరిష్కారం అయిందని అన్నారు. ఇది తెలియక జరిగిన చిన్న పొరపాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సందర్భంగా ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ యశోద సినిమాలో మా హాస్పిటల్ పేరు వాడడంతో నిజంగానే మేము హర్ట్ అయ్యాము, అయితే నిర్మాత దృష్టికి ఈ విషయం వెళ్లిన వెంటనే ఆయన చాలా త్వరగా సమస్యను క్లియర్ చేశారని అన్నారు.

దీంతో సమస్య పరిష్కారమైందని అన్నారు డాక్టర్స్ అందరూ కూడా ప్రాణాలు కాపాడాలని కోరుకుంటారని పేర్కొన్న ఆయన సినిమా వాళ్లు కూడా మా ప్రొఫెషన్ గౌరవించాలని అన్నారు. ఇప్పటికీ ఎవరికైనా ఏదైనా జరిగితే ఠాగూర్ సినిమా లాగా జరిగింది అంటారని ఎందుకంటే సినిమా అనేది చాలా బలమైన మాధ్యమం అని అన్నారు. ఇక ఆ రోజు ఐదు కోట్లకు డ్యామేజ్ సూట్ వేశారు కదా?' అని కొందరు ప్రశ్నించారన్న ఆయన అప్పుడు కూడా చెప్పానని, డబ్బుల కోసం కేసు వేయలేదని అన్నారు. అసలు మా బాధ విలువ చెప్పాలని చేశామని, ఈవా ఐవీఎఫ్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూడటం మా ఉద్దేశమని అన్నారు. 

మొన్న సాయంత్రం నాకు సినిమా చూపించారని, అందులో ఈవా పేరుకు సంబంధించినవి అన్నీ తొలగించడంతో నిన్న కోర్టుకు వెళ్లి 'యశోద' నిర్మాత చేసిన మార్పులతో సంతృప్తిగా ఉన్నామని చెప్పామని అన్నారు. అయితే ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపామని, వెంటనే కోర్టు ఆమోదించిందని, ఇరు వర్గాల అంగీకారంతో కేసు విత్ డ్రా అయ్యిందని వెల్లడించారు. ఇక ఇంతటితో ఈ సమస్య సమసి పోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సమంత ప్రధాన పాత్రలో హరి హరీష్ అనే ఇద్దరు దర్శకులు తెరకెక్కించిన ఈ సినిమాని నవంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడమే కాక కలెక్షన్ల వర్షం కూడా కురిపించింది. కేవలం తెలుగు భాషలోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో సమంతతో పాటు కల్పికా గణేష్, ప్రియాంక శర్మ, దివ్య శ్రీపాద, ఉన్ని ముకుందన్, వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారి ఇతర కీలక పాత్రల్లో నటించారు.
Also Read: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే

Also Read: అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2లో స్పెషల్ ఎపిసోడ్..అల్లు విత్ దగ్గుబాటి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News