Will Dil Raju Create History with Varasudu: 2023 సంక్రాంతికి తెలుగు హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. వాటితో పాటు తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా కూడా తెలుగులో రిలీజ్ అవుతుంది. వాస్తవానికి వారసుడు సినిమా కూడా తెలుగు సినిమా అని అనుకున్నారు కానీ దిల్ రాజు తీసుకున్న నిర్ణయం వల్ల అది ఇప్పుడు డబ్బింగ్ సినిమాగా మారింది.
నిజానికి సినిమా ప్రకటించిన సమయంలో ఈ సినిమాని తెలుగు సహా తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని అన్నారు. అయితే తెలుగులో ప్రధానంగా రూపొందించి దాన్ని మిగతా భాషల్లోకి డబ్బింగ్ చేస్తారనుకుంటే తమిళ ప్రధానంగా సినిమాని తెరకెక్కించి హిందీ, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు. అందుకు దిల్ రాజు చెప్పిన కారణాలు ఆయనకు అనుకూలంగా ఉండనే ఉన్నాయి. కానీ ఇప్పుడు గతంలో దిల్ రాజు చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఆయనకు తలనొప్పిగా మారాయి.
ఈ విషయం మీద ఆయన ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానని అన్నారు గానీ ఇప్పటివరకు ఆ క్లారిటీ అయితే ఇవ్వలేదు. కాకపోతే తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో మాట్లాడిన ఆయన ఈ విషయం గురించి మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తో తాము ఒక ఒప్పందానికి వచ్చామని వాళ్లకు లేని ఇబ్బంది మిగతా వాళ్ళకి ఎందుకని కామెంట్ చేశారు.
ఇదంతా బాగానే ఉన్నా ట్రేడ్ వర్గాల చెబుతున్న దాని ప్రకారం 1997 నుంచి 2020 వరకు సంక్రాంతికి వచ్చిన తెలుగు సినిమాలతో పోటీ పడిన ఒక్క డబ్బింగ్ సినిమా కూడా బాక్సాఫీస్ పరంగా మన సినిమాలు కంటే ఎక్కువ వసూలు చేయలేదని అంకెలు చెబుతున్న నిజం అలాగే ఉందని అంటున్నారు. ఒకవేళ దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ వారసుడు సినిమా కనుక తెలుగు సినిమాల కంటే ఎక్కువ వసూలు చేస్తే ఒక రకంగా చరిత్రను తిరగరాయడమే అవుతుందని ఒకవేళ అలా చేయలేకపోతే ఈ సినిమా కూడా మీద డబ్బింగ్ సినిమాల్లో కొట్టుకుపోతుందని అంటున్నారు. మరి దిల్ రాజు చరిత్ర తిరగరాస్తాడా లేక అందరి లాగానే ఈ డబ్బింగ్ సినిమా విషయంలో కూడా బోల్తా పడతాడా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.
Also Read: I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!
Also Read: Bigg Boss Samrat New Car : కొత్త కారు కొన్న బిగ్ బాస్ సామ్రాట్.. ధర ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook