Nandamuri Balakrishna NBK 108 : బాలయ్య కోసం తప్పని తిప్పలు.. అనిల్ రావిపూడికి ఇక చుక్కలే

Nandamuri Balakrishna NBK 108 నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న సినిమాకు మళ్లీ చిక్కులు మొదలైనట్టు తెలుస్తోంది. అసలే బాలయ్యకు హీరోయిన్‌ను వెతికి పట్టడం ఎంత కష్టంగా మారుతోందో అందరికీ తెలిసిందే.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2022, 11:16 AM IST
  • డిసెంబర్‌లో సెట్స్ మీదకు NBK 108
  • బాలయ్యకు సెట్ కాని హీరోయిన్
  • అనిల్ రావిపూడికి ఇక చుక్కలేనా?
Nandamuri Balakrishna NBK 108 : బాలయ్య కోసం తప్పని తిప్పలు.. అనిల్ రావిపూడికి ఇక చుక్కలే

Anil Ravipudi NBK 108 Project : ప్రస్తుతం  సీనియర్ హీరోలకు హీరోయిన్లను పట్టడం చాలా కష్టం అవుతోంది.మరీ ముఖ్యంగా బాలయ్య బాబు సినిమాలకు హీరోయిన్లు దొరకడం లేదు. తిరిగి తిరిగి అదే సోనాల్ చౌహాన్, ప్రగ్యా జైస్వాల్ వంటి వారినే తీసుకొస్తున్నారు. చిరంజీవి విషయంలోనూ హీరోయిన్ల కొరత కనిపిస్తుంటుంది. ఇప్పుడు బాలయ్య సినిమా కోసం అనిల్ రావిపూడి తెగ కష్టపడుతున్నాడట. గోపీచంద్ మలినేని సైతం బాలయ్య కోసం ఓ హీరోయిన్‌ను సెట్ చేసేందుకు తల ప్రాణం తోకకు వచ్చింది.

శ్రుతి హాసన్‌తో మంచి ర్యాపో ఉండటంతో.. ఆమెను గోపీచంద్ మలినేని సంప్రదించాడు. బాలయ్య ప్రాజెక్ట్‌కు ఓకేలా చెప్పించేసుకున్నాడు. కానీ ఇప్పుడు అనిల్ రావిపూడి అయితే బాలయ్య ప్రాజెక్ట్ కోసం హీరోయిన్‌ను సెట్ చేసేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడట. దీని కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హాను కూడా సంప్రదించారట. ఆమె కూడా ఓకే చెప్పిందట. ఆమె చెప్పిన రేటు చూసి దర్శక నిర్మాతలు ఖంగుతిన్నారట. దాదాపు ఆరు కోట్లు డిమాండ్ చేయడంతో సోనాక్షి సిన్హాను పక్కన పెట్టేశారట.

మరి ఇప్పుడు సినిమా షూటింగ్‌కు దగ్గర పడుతోంది. డిసెంబర్‌లో సినిమాను ప్రారంభించేస్తున్నారు. ఇంతలో హీరోయిన్‌ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కానీ బాలయ్యకు తగ్గ హీరోయిన్ మాత్రం కనిపించడం లేదు. ఇంత ఒత్తిడిలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్‌కు హీరోయిన్‌ను సెట్ చేయాలంటే చుక్కలు కనిపించేలా ఉన్నట్టుంది.

మరి అనిల్ రావిపూడి తన కథకు తగ్గట్టుగా బాలయ్యకు సరిపోయే హీరోయిన్‌ను సెట్ చేస్తాడా? లేదా? అన్నది చూడాలి. నాగ్, వెంకీ, చిరు, బాలయ్యలకు హీరోయిన్లకు పట్టుకోవడం దర్శకులకు ఎప్పటి నుంచో పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే. మరి బాలయ్యకు ఈసారి జోడిగా ఎవరు కనిపిస్తారో చూడాలి.

Also Read : Shruti Haasan Trolls : మేకప్ లేని ఫోటోపై ట్రోలింగ్..ఇక సమాజం ఎప్పటికీ మారదు.. శ్రుతి హాసన్ అసహనం

Also Read : Vijay Devarakonda ED : పాపులారిటీ ఉంటే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి.. ఈడీ విచారణపై విజయ్ కౌంటర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x