YS Sharmila: కమలం పార్టీతో సీఎం కేసీఆర్ డ్యూయెట్లు.. ఆయనను బీజేపీ పెళ్లాం అనలా..?: వైఎస్ షర్మిల సెటైర్లు

Ys Sharmila Padayatra: ఎవరు ఏం చేసినా పాదయాత్రను ఆపేది లేదని వైఎస్ షర్మిల తేల్చిచెప్పారు. తాను ఎవరికి దత్తపుత్రికను కాదని.. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి తిరిగిన కేసీఆర్‌ని బిజేపీ పెళ్లాం అనాలా..? సెటైర్లు వేశారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 2, 2022, 06:11 PM IST
YS Sharmila: కమలం పార్టీతో సీఎం కేసీఆర్ డ్యూయెట్లు.. ఆయనను బీజేపీ పెళ్లాం అనలా..?: వైఎస్ షర్మిల సెటైర్లు

Ys Sharmila Padayatra: తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డను అని.. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి పాదయాత్రను మాత్రం ఆపేది లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టంచేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. హైదరాబాద్‌ నగరంలోని లోటస్‌ పాండ్‌లోని తన నివాసంలో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ నెల 4 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. దాడులు చేసినా.. కొట్టినా.. చంపినా బెదిరేది లేదన్నారు. ఆపద సమయంలో తనతో ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. 

ఆ తరువాత అదనపు డీజీ జితేందర్‌ను కలిసి పాదయాత్రకు సంబంధించిన వివరాలను అందజేశారు వైఎస్ షర్మిల. తన పాదయాత్రకు భద్రత కల్పించాలని ఆమె కోరారు. పాదయాత్రను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ.. కోర్టు ఇచ్చిన ఆర్డర్‌ కాపీని కూడా పోలీసులకు అందించారు. అనంతరం మీడియాలో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. 

'కేసీఆర్ ప్రజా వైఫల్యాలను ప్రతి రోజు ఎండగడతాము. కేసీఆర్ బిడ్డ లిక్కర్‌లో దోచుకుంటున్నారు. కేసీఆర్ కొడుకు రియల్ ఎస్టేట్‌లో దోచుకుంటున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు నా పోరాటం ఆగదు. 
నా పాదయాత్రను ఆపే ప్రయత్నం కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. నేను గవర్నర్‌ను కలసి నా పాదయాత్రకు సంబంధించిన విషయాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను వివరించాను.

తెలంగాణ మళ్లీ ఆంధ్రాలో కలవడం సాధ్యమేనా.. నేను తెలంగాణ కోడలిని.. నేను తెలంగాణ పేరుతోనే పార్టీ ఏర్పాటు చేసుకున్నాను. సమైక్య రాష్ట్రం మళ్లీ ఏర్పడుతుందని చేస్తున్న గోబెల్స్ ప్రచారం తెలంగాణ ప్రజలు నమ్మరు. కేసీఆర్ బీజేపీతో డ్యూయెట్లు పాడుతున్నారు. బీజేపీకి దత్త పత్రికను కానే కాదు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి తిరిగిన కేసీఆర్‌ని బిజేపీ పెళ్లాం అనాలా..? లిక్కర్ స్కామ్, ప్రాజెక్ట్‌లలో కేసీఆర్ కుటుంబం లక్షల కోట్లు సంపాదించుకున్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి అవినీతి బయటపెట్టాలి..' అని వైఎస్ షర్మిల అన్నారు. 

రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆమె విమర్శించారు. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాయకుండా ఫ్రెండ్లీ పోలీసు కాన్సెప్ట్ ప్రకారం వ్యవహరించాలని కోరారు. తమ పాదయాత్ర ఆగిన చోట నుంచే మొదలు పెడతామని పోలీసులకు చెప్పామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర తర్వాత.. రాష్ట్రంలో పాదయాత్రను ముగిస్తానని షర్మిల తెలిపారు. 

Also Read: CM Jagan: బోటులో సీఎం జగన్ మోహన్ రెడ్డి షికారు.. చిత్రావతి  రిజర్వాయర్‌లో విహారం  

Also Read: EPF Service: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. వెంటనే ఈ పనిని పూర్తిచేయండి.. లేకపోతే..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News