Six Seater Electric Cycle Video: ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఆనంద్ మహింద్రాకు ఒక గొప్ప పేరుంది. పేరొందిన వ్యాపారవేత్తగా అంత బిజీగా ఉంటూనే.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ అంతే యాక్టివ్ గా ఉంటుంటారు. గ్రామీణ భారతంలోని ఆవిష్కరణల గురించి అప్పుడప్పుడూ మన ముందుకు తీసుకురావడంలో ఆనంద్ మహింద్రా ఎప్పుడూ ముందే ఉంటారనే సంగతి తెలిసిందే. ఆనంద్ మహింద్రాకు సోషల్ మీడియాలో ఏదైనా నచ్చిందా అంటే.. ఆ పోస్టును లేదా వీడియోను అందరితో పంచుకుంటుంటారు. పైగా ఆ పోస్టుకు విలువ పెంచేలా, అందరినీ ఆకట్టుకునేలా ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా ఇస్తారు.
ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు అని అనుకుంటున్నారా ? మరేం లేదండి.. తాజాగా ఆనంద్ మహింద్రా ట్విటర్ ద్వారా షేర్ చేసిన ఒక వీడియో కూడా అందరినీ అలాగే ఆకట్టుకుంటోంది మరి. గ్రామీణ భారతానికి చెందిన ఒక యువకుడు తయారు చేసిన 6 సీటర్ సైకిల్ ఇది. ఈ సైకిల్‌లో అంతగా ప్రత్యేకత ఏముంది అని అనుకుంటున్నారా ? ఏ ప్రత్యేకత లేకపోతే అది ఆనంద్ మహింద్రా కంట్లో ఎందుకు పడుతుంది చెప్పండి. ఈ సైకిల్‌కి ఉన్న ప్రత్యేకత ఎలక్ట్రిక్ సైకిల్. అవును.. ఈ సైకిల్‌ని తొక్కాల్సిన పని లేదు. ఎలక్ట్రిక్‌తో నడిచే ఈ సైకిల్ ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్లు రయ్యుమని దూసుకుపోతుంది.
With just small design inputs, (cylindrical sections for the chassis @BosePratap ?) this device could find global application. As a tour ‘bus’ in crowded European tourist centres? I’m always impressed by rural transport innovations, where necessity is the mother of invention. pic.twitter.com/yoibxXa8mx
— anand mahindra (@anandmahindra) December 1, 2022
చూశారు కదా.. ఈ వీడియోలో కనిపిస్తున్న యువకుడే ఈ ఎలక్ట్రిక్ సైకిల్‌ని తయారు చేశాడట. ఈ సైకిల్‌ని తయారు చేయడానికి 10 - 12 వేల రూపాయల వరకు ఖర్చయిందని.. కేవలం 8 రూపాయల నుంచి 10 రూపాయల ఖర్చుతోనే ఛార్జింగ్ కూడా అవుతుందని చెప్పుకొచ్చాడు. ఒకేసారి ఆరుగురు ప్రయాణికులను మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ సైకిల్ ఇంత తక్కువ ఖర్చులో తయారవడమే కాకుండా నిర్వహణ ఖర్చు కూడా లీటర్ పెట్రోల్ ధరలో పదో వంతులోపే ఉండటం గొప్ప విషయమే అవుతుంది కదా. అవసరం అనేది ఎలాంటి ఆవిష్కరణలకైనా ఊతం ఇస్తుందని.. అందుకే రూరల్ ఇండియాలో కనిపెట్టే రవాణా వాహనాలు తనని ఎప్పుడూ అబ్బూరపరుస్తుంటాయని ఆనంద్ మహింద్రా ( Anand Mahindra ) తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Also Read : Viral Video: ఏ కరువులో ఉన్నార్రా నాయనా.. ఆహారం కోసం గేటు బద్ధలు కొట్టడం ఏంటి..?
Also Read : పాడుబడిన ఇంట్లో 7 కిలోల కింగ్ కోబ్రా.. బుసలు కొడుతూ మీదికివచ్చినా భయపడని అమ్మాయి! ఎలా పట్టిందో చూడండి
Also Read : King Cobra Viral Video: ఒకే బిలంలో 6 కింగ్ కోబ్రాలు.. ఎంత ఈజీగా పట్టాడో! మీరే చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook