Adding salt to fruit: పండ్లు ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిని ప్రతి రోజూ తింటే శరీరాన్ని వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. పండ్లలో బాడీకి కావాల్సిన పోషకాలు, విటమిన్లు లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ ఈ పండ్లను తీసుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా చాలా మంది పండ్లు తినే క్రమంలో వాటిపై ఉప్పు చల్లుకొని తింటున్నారు. అయితే ఇలా చల్లుకుని తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం వల్ల ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పండ్లపై ఉప్పు చల్లడం వల్ల కలిగే నష్టాలు:
1. నివేదికల ప్రకారం.. ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు 5 గ్రాముల ఉప్పు మాత్రమే అవసరం. శరీరానికి కావలసినంత ఉప్పు ఆహారంతో తినడం మంచిది. అయితే అతిగా తీసుకుంటే చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పండ్లపైన ఉప్పు వేసుకుని తినడం వల్ల గుండెపోటు, రక్తపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
2. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా శరీరంలో నీరు నిలుపుదల సమస్యలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కడుపు ఉబ్బరం ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ లోపలే ఉండిపోతాయి.
3. కోసిన పండ్లపై ఉప్పు వేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందవు అంతేకాకుండా శరీరంలో పోషకాల పరిమాణాలు కూడా తగ్గే అవకాశాలున్నాయి. కాబట్టి పండ్లపై ఉప్పు చల్లుకుని తినడం మానుకోవాలి. అంతేకాకుండా దీని వల్ల మూత్రంలో సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Nanda Kumar Bail: నంద కుమార్‌కి బెయిల్.. అంతలోనే పిటి వారంట్ కావాలన్న పోలీసులు
Also Read: Harish Rao: ప్రధాని మోదీ ఇచ్చిన వాగ్ధానం ఏమైందన్న మంత్రి హరీశ్ రావు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook