ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువౌతున్నాయి. దీనికి ప్రధాన కారణం రక్తం చిక్కగా ఉండటమే. అందుకే రక్తం పల్చబడేందుకు వైద్యులు మందులిస్తుంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే..అల్లోపతి మందులు వాడాల్సిన అవసరం లేదు.
స్థూలకాయం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా హార్ట్ ఎటాక్, స్ట్రోక్స్ సహా చాలా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్ ముప్పును దూరం చేసేందుకు వైద్యులు బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. ఈ మందుల కారణంగా బ్లడ్ క్లాట్ అయ్యే ప్రమాదం తగ్గుతుంది. మీ రక్తం కూడా చిక్కగా ఉంటే..కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే ఆ సమస్య దూరమౌతుంది.
డైట్లో చేర్చుకోవల్సిన ఫుడ్స్
1. వెల్లుల్లి శరీరంలో చిక్కగా ఉన్న రక్తాన్ని పల్చగా చేయడంలో కీలకంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ థ్రాంబోటిక్ ఏజెంట్స్ రక్తాన్ని పల్చగా చేస్తాయి. వెల్లుల్లి రోజూ తినడం వల్ల మీ రక్తం చిక్కగా మారదు. వెల్లుల్లిని అందుకే సహజసిద్దమైన యాంటీ బయోటిక్‌గా కూడా వినియోగిస్తుంటారు.
2. రెడ్ చిల్లీని సాధారణంగా ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్న సెల్సిలేట్స్ ఆరోగ్యానికి ప్రయోజనకరం. రెడ్ చిల్లీ కూడా రక్తాన్ని పలుచన చేయడంలో దోహదం చేస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్రెషర్ నియంత్రిస్తుంది.
3. రక్తాన్ని పలుచన చేసేందుకు అల్లంలో కూడా అద్భుతమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అల్లంలో యాస్పిరిన్ సెల్సిలేట్స్ సింథెటిక్ గుణాలు ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచన చేయడంలో దోహదం చేస్తాయి. అల్లం టీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
Also read: Cholesterol Tips: ఈ 5 డ్రింక్స్ తీసుకుంటే..రక్త నాళికల్లో ఉండే కొవ్వు కూడా 30 రోజుల్లో మాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook