Adivi Sesh unveils Enthavaaru Gaani Teaser : అడివి శేష్ ప్రస్తుతం ఫుల్ ఫాం మీదున్నాడు. హిట్ 2 సినిమాతో హిట్టు కొట్టేశాడు. ఈ సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్న అడివి శేష్ తాజాగా ఎంతవారుగాని అనే సినిమా టీజర్‌ను రిలీజ్ చేశాడు. అడివి శేష్ చేతుల మీదుగా రిలీజ్ చేయించడంతో ఈ మూవీ టీజర్ మీద అందరి దృష్టి పడింది. సూర్య శ్రీనివాస్, షెర్రీ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో ఈ సినిమా రాబోతోంది. ఈ చిత్రంతో ఎన్ శ్రీనివాసన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నాడు. ఇక ఈ సినిమాను రాజశేఖర్ అన్నభీమోజు, సురేంద్ర కారుమంచి, శివ ముప్పరాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook