Harish Shankar : కుడిదిలో పడ్డ ఎలుకలా హరీష్‌ శంకర్?.. పవన్ ప్రాజెక్ట్ ఉందా? లేదా?.. డైలామాలో డైరెక్టర్

Pawan Kalyan Harish Shankar Movie పవన్ కళ్యాణ్‌ కొత్త సినిమాలను అయితే ప్రకటిస్తున్నాడు గానీ సెట్స్ మీదున్న సినిమాలను పూర్తి చేయడం లేదు. ఒప్పుకున్న సినిమాల సంగతే తెలియడం లేదు కానీ కొత్త సినిమాలు ప్రకటించడంపై అందరూ ఆశ్చర్యపోతోన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 6, 2022, 08:29 AM IST
  • వరుస సినిమాలతో బిజీగా పవన్ కళ్యాణ్‌
  • సుజిత్‌ కాంబోలో పవన్ గ్యాంగ్ స్టర్ సినిమా
  • హరిష్‌ శంకర్ పరిస్థితిపై గందరగోళం
Harish Shankar : కుడిదిలో పడ్డ ఎలుకలా హరీష్‌ శంకర్?.. పవన్ ప్రాజెక్ట్ ఉందా? లేదా?.. డైలామాలో డైరెక్టర్

Pawan Kalyan Harish Shankar Movie : హరిష్ శంకర్ చివరి సినిమా ఏదో అందరికీ గుర్తుండే ఉంటుంది. గద్దలకొండ గణేష్ అంటూ రీమేక్‌తో వరుణ్‌ తేజ్‌కు హిట్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి హరిష్‌ శంకర్ నుంచి ఇంకో సినిమా వస్తే ఒట్టు. పవన్ కళ్యాణ్‌తో మైత్రీ సంస్థకు హరీష్ శంకర్ ఓ సినిమా చేస్తాడు అని ఇది వరకు ఎప్పుడో ప్రకటన వచ్చింది. ఆ సినిమా ఇదిగో ప్రారంభం, అదిగో ప్రారంభం అని అంటూనే ఉన్నారు. కానీ ఇంత వరకు ఒక్క ఇంచు కూడా ముందుకు కదల్లేదు.

హరీష్‌ శంకర్ మాత్రం ఈ సినిమా కథ రెడీ అయిందని, స్క్రిప్ట్ పూర్తయిందని చెబుతూనే ఉన్నాడు. ఆచార్య సమయంలో ఓ డైలాగ్ బయటకు వదిలి అందరినీ మెప్పించాడు. ఇలా లీకులు ఇస్తూ వచ్చాడు తప్పా.. హరీష్ శంకర్ మాత్రం తన సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోయాడు. అది అతని చేతుల్లో లేనేలేదు. పవన్ కళ్యాణ్‌ ఎప్పుడు కనికరిస్తాడా? అని అటు నిర్మాతలు, ఇటు దర్శకుడు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ ఈ భవదీయుడు భగత్ సింగ్ మాత్రం సెట్స్ మీదకు రావడం లేదు.

తాజాగా పవన్ కళ్యాణ్‌ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. సుజీత్ దర్శకత్వంలో, దానయ్య నిర్మాణంలో ఓ కొత్త సినిమా చేస్తున్నాడు పవర్ స్టార్. ఇది వరకు ప్రకటించిన సినిమాల సంగతే తేలడం లేదు. మధ్యలో సుజీత్ వచ్చి చేరాడు. వినోదయ సిత్తం సినిమా రీమేక్ సంగతి తేలలేదు. హరి హర వీరమల్లు షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం. హరీష్‌ శంకర్ మైత్రీ మూవీ సంగతి అసలే తేలడం లేదు. 

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. హరీష్‌ శంకర్ చెప్పిన కథ పూర్తిగా నచ్చలేదని, రీమేక్ అయితే బాగా తీస్తావ్ అని.. విజయ్ నటించిన తేరి రీమేక్ మీద దృష్టి పెట్టమని పవన్ చెప్పాడట. ఇలా అనేసి పవన్ కళ్యాణ్ మళ్లీ తన సినిమాల మీద ఫోకస్ పెట్టేశాడట. ఇప్పుడు హరీష్‌ శంకర్ బయటకు వెళ్లి సినిమా చేయలేడు.. మళ్లీ ఇలా స్క్రిప్ట్ రాసుకోవడానికి చాలా టైం పట్టేట్టుంది. దీంతో ఇన్ని రోజులు హరీష్‌ శంకర్ పడ్డ కష్టమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిందనిపిస్తోంది.

Also Read : Anasuya Bharadwaj : నన్ను నమ్మండి.. డబ్బుల కోసం నేను అవి చేయను.. అనసూయ కామెంట్స్ వైరల్

Also Read : Jabardasth Sujatha : సుజాత అతి చేష్టలు.. రాకేష్‌తో చెట్టాపట్టాలేసుకుంటూ.. నెటిజన్ల సెటైర్లు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News