High Blood Pressure Control Tips: రోజురోజుకు భారత దేశంలో అధిక రక్తపోటు రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎందుకంటే చాలామంది ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను అతిగా తింటున్నారు. సాల్టీ ఫుడ్స్‌లో సోడియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే దీని వల్ల కూడా అధిక రక్తపోటు సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ నూనె లేదా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తింటున్నారు. దీంతో ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకుపోయి గుండెపోటు సమస్యలతో పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.
రక్తపోటును నియంత్రించుకునేందుకు చాలా మంది మార్కెట్లో లభించే చాలా రకాల ప్రొడక్షన్ వినియోగిస్తున్నారు. అయితే దీనివల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటి చిట్కాలతో కూడా సులభంగా రక్తపోటు నుంచి ఉపశమనం పొందావచ్చు.
ముఖ్యంగా రక్తపోటును నియంత్రించడానికి పండ్లు చాలా రకాలుగా సహాయపడతాయి. ఇందులో ఉండే గుణాలు రక్తపోటు గుండెపోటు గుండె వైఫల్యం త్రిపుల్ నాళాల వ్యాధి గుండె జబ్బుల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి పండ్లను తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పండ్లతో అధిక రక్తపోటు సమస్యలకు చెక్:
అరటిపండు:
అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తప్పకుండా అరటి పండ్లను ప్రతిరోజు తినాల్సి ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధిక పరిమాణంలో లభిస్తుంది కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తింటే రక్తపోటు సమస్యలు తగ్గి గుండెపోటు వంటి వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఆరెంజ్:
బత్తాయి పండ్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా అధిక రక్తపోటును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి ముఖ్యంగా సీజనల్ వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ నారింజ పండ్లను ఉదయం పూట తినాల్సి ఉంటుంది.
యాపిల్ :
యాపిల్ శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలిగించే హెల్తీ ఫ్రూట్స్. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ ఫ్రూట్స్ని అతిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తారు. ఈ పండ్ల లో ఉండే గుణాలు అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ పండ్లను తినాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read : Bigg Boss Shannu - Deepthi : దీప్తిని పూర్తిగా మరిచిపోయిన షన్ను.. ఈ పోస్ట్ అర్థం అదేనా?
Also Read : Allu Arjun Team : బన్నీ టీం వల్ల తడిసిమోపడైంది!.. పుష్ప కోసం రష్యాలో పెట్టిన ఖర్చు ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook