How To Control High Bp: ఈ ఫుడ్స్‌ అతిగా తీంటే మీకు బీపీ పెరగడం ఖాయం.. ఎందుకో తెలుసా..?

How To Control High Bp In 1 Day: అధిక రక్తపోటు సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన సలహాలను పాటించాల్సి ఉంటుంది. లేకపోతే గుండెపోటు ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 10, 2022, 04:12 PM IST
How To Control High Bp: ఈ ఫుడ్స్‌ అతిగా తీంటే మీకు బీపీ పెరగడం ఖాయం.. ఎందుకో తెలుసా..?

How To Control High Bp In 1 Day: చాలామంది ప్రస్తుతం వేడి పకోడాలు, క్రిస్పీ కచోరి, నోటికి రుచిని అందించే చాట్ ను విచ్చలవిడిగా తినేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా తరచుగా తినడం వల్ల చాలామంది అధిక రక్తపోటు సమస్యలకు గురవుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినే వారి శాంపిల్స్ చెక్ చేస్తే.. హైపర్ టెన్షన్ తో బాధపడుతున్న వారి సంఖ్యే అధికమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అధిక రక్తపోటు సమస్య నుంచి ఎంత సులభంగా ఉపశమనం పొందితే అంత మంచిదని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ పేర్కొంది. లేకపోతే గుండెపోటు బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరిగే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అధిక బీపీ ఉన్న వారు ఊరగాయలు తినొచ్చా..?
అధిక బీపీతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఊరగాయలకు దూరంగా ఉండటం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉక్కు పరిమాణం అధికంగా ఉండడం వల్ల ఇది రక్తనాళాలను దెబ్బతీయడమే కాకుండా బిపిని పెంచేందుకు కారణం అవుతుంది. కాబట్టి వీటిని తినకపోవడం చాలా మంచిది.

కాఫీ:
తరచుగా కాఫీ ప్రతి ఒక్కరూ తాగుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు మైండ్ ను రిఫ్రిజ్ చేయడమే కాకుండా ఆలోచనలను రెట్టింపు చేస్తాయి. కాబట్టి చాలామంది తరచుగా కాఫీని తీసుకుంటూ ఉంటారు. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కాఫీని అతిగా తీసుకోవడం వల్ల రక్తపోటు స్థాయి తీవ్రంగా మారుతుంది. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కాఫీని అతిగా తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్ చేసిన మాంసం:
ప్రాసెస్ చేసిన మాంసంలో అధికంగా సోడియం ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తరచుగా ప్రాసెస్ చేసిన మీట్ ను తీసుకుంటే అది రక్తపోటు పై ప్రభావం పడి తీవ్రతర అనారోగ్య సమస్యలకు గురి చేసే అవకాశాలున్నాయి. కాబట్టి అతిగా సాండ్విచ్లు, బర్గర్లు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తీపి:
అధిక బీబీ తో బాధపడుతున్న వారు తీపి పదార్థాలను కూడా అతిగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు హైపర్ టెన్షన్ ప్రభావితం చేసి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు తీపి పదార్థాలను తీసుకోకపోవడం చాలా మంచిది.

Also Read : Nandamuri Balakrishna : దిల్ లేని రాజు.. దిల్ రాజు.. బాలయ్య పంచ్‌లు

Also Read : Jabardasth Sri Satya : పొట్టి డ్రెస్సులో జబర్దస్త్ బ్యూటీ.. కొత్త లుక్కులో సత్య శ్రీ అదుర్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News