Planet Transit 2022: ప్రతి సంవత్సరం పుష్య మాసంలో సూర్యభగవానున్ని పూజిస్తారు. ఈ క్రమంలో పూజా కార్యక్రమాలు చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో కూడా ప్రశాంతత లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఇదే నెలలో సూర్యుడు ఇతర గ్రహంలోకి సంచారం చేయబోతున్నాడు. దీని వల్ల అన్ని రాశువారిలో తీవ్ర మార్పులు సంభవించే ఛాన్స్ ఉందని జోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. సూర్య గ్రహం ధనస్సు రాశిలోకి సంచారం చేయడం వల్ల పలు రాశువారికి తీవ్ర నష్టాలు కూడా కలిగే అవకాశాలున్నాయి. అయితే ఈ క్రమంలో ఏయే రాశువారు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రాశివారిపై సూర్య గ్రహం ప్రభావం:
వృషభ రాశి:
సూర్య గ్రహం సంచారం వల్ల వృషభ రాశి వారికి మంచి, చెడు రెండూ ప్రభావాలు కలిగే అవకాశాలున్నాయని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో అన్ని రాశుల వారు పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది. ఈ వారి జీవితంలో పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ క్రమంలో తల్లిదండ్రుల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడే అవకాశాలున్నాయి. కాబట్టి వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. లేకపోతే ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
మిథునం:
సూర్య గ్రహం సంచారం వల్ల మిథున రాశి వారి వైవాహిక జీవితంలో చాలా రకాల మార్పులు సంభవించవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో వాగ్వాదాలకు కూడా దారి తీసే అవకాశాలున్నాయి. కార్యాలయంలో వాదనలు పెట్టుకోవడం మానుకుంటే చాలా మంచిదని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ రాశివారు పెట్టుబడులు పెట్టే ముందు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారు వ్యాపారాలు ప్రారంభించే క్రమంలో తప్పకుండా నిపుణుల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది.
సింహ రాశి:
ఈ సంచారం వల్ల సింహ రాశి వారి జీవితం హెచ్చుతగ్గులకు గురవ్వచ్చు. అంతేకాకుండా రాశి వారు తప్పకుండా ఆర్థిక విషయాల పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అజాగ్రత్త కారణంగా తీవ్ర నష్టాలకు గురయ్యే అవకాశాలున్నాయని తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తుల:
సూర్య గ్రహ సంచారం వల్ల తుల రాశి వారు కుటుంబ విషయాల్లో బిజీగా మారుతారు. వ్యక్తిగత జీవితంలో మంచి ప్రయోజనాలు పొందడమేకాకుండా వృత్తి పరంగా లాభాలు పొందే అవకాశాలున్నాయి. అయితే ఈ రాశి వారు తప్పకుండా ఇంటికి కొంత కాలం దూరంగా ఉండాలని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఇది కూడా చదవండి : india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురికి గాయాలు
ఇది కూడా చదవండి : India-US Ties: సూపర్ పవర్‌గా భారత్.. మరో అగ్రరాజ్యంగా మారుతుంది: అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook