Pawan Kalyan Nandamuri Balakrishna : వీర సింహారెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్‌.. బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు

Pawan Kalyan Visits Veera Simha Reddy set పవన్ కళ్యాణ్‌ తాజాగా నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సెట్‌లో సందడి చేశాడు. ఇలా బాలయ్య, పవన్ కళ్యాణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించే సరికి అంతా షాక్ అవుతున్నారు. మామూలుగా అయితే అన్ స్టాపబుల్ షోలో కలిసి కనిపిస్తారని అంతా అనుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2022, 07:19 PM IST
  • వీర సింహా రెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్‌
  • బాలయ్యతో పవన్ కళ్యాణ్‌ భేటీ
  • అన్ స్టాపబుల్ షోకి కూడా వస్తాడా?
Pawan Kalyan Nandamuri Balakrishna : వీర సింహారెడ్డి సెట్‌లో పవన్ కళ్యాణ్‌.. బాలయ్యతో పవర్ స్టార్ ముచ్చట్లు

Pawan Kalyan with Nandamuri Balakrishna మెగా, నందమూరి అభిమానుల మధ్య ఉండే కోల్డ్ వార్, జరిగే ఫ్యాన్ వార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాలయ్య మాటలు, తన వంశం, తన బ్లెడ్డు, బ్రీడు అంటూ చేసే వ్యాఖ్యలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బాలయ్య సైతం చిరంజీవి పట్ల దూరంగానే ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇలా బాలయ్య చేసే వ్యాఖ్యలు పరోక్షంగా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేసిట్టుగా అనిపిస్తుంది. ఇక ఇప్పుడు సినిమాల విషయంలో చిరు వర్సెస్ బాలయ్య ట్రెండ్ నడుస్తోంది.

ఇలాంటి సమయంలో ఇలా వీర సింహా రెడ్డి సెట్‌లో బాలయ్యతో కలిసి పవన్ కళ్యాణ్‌ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. గత కొన్ని రోజులుగా బాలయ్య పవన్ కళ్యాణ్ కలిసి కనిపించబోతోన్నారనే టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య తన అన్ స్టాపబుల్ షో కోసం త్రివిక్రమ్‌, పవన్ కళ్యాణ్‌ను పట్టుకురావాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ దిశగా అడుగులు పడ్డట్టుగా కనిపిస్తోంది.

తాజాగా బాలయ్య తన సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అందుకే వీర సింహా రెడ్డి సినిమా షూటింగ్‌లో బాలయ్య ఉండగా.. పవన్ కళ్యాణ్‌ వెళ్లి కలిశాడు. అయితే పవన్ కళ్యాణ్‌ను బాలయ్యే ఆహ్వానించినట్టు తెలుస్తోంది. అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక ఈ ఎపిసోడ్‌ను సంక్రాంతి స్పెషల్‌గా ప్లాన్ చేయాలని భావిస్తోన్నారట. మరి బాలయ్య అడిగాక పవన్ కళ్యాణ్‌ నో అని అంటాడా? అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్‌ ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఇది తేలకముందే పవన్ కళ్యాణ్‌ రెండు సినిమాలను ఆల్రెడీ ప్రకటించేసిన సంగతి తెలిసిందే. సుజిత్, హరీశ్ శంకర్‌లతో పవన్ కళ్యాణ్‌ సినిమాలు చేయబోతోన్నాడు. కానీ ఇవి ఎప్పుడు ప్రారంభం అవుతాయో ఎవ్వరికీ తెలియడం లేదు.

Also Read : Laththi Day 1 Collections : విరిగిన విశాల్ 'లాఠీ'.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?

Also Read : Manchu Family Pays Tribute to Kaikala : కైకాల మరణం.. ప్రశాంత్ నీల్ సంతాపం.. మంచు ఫ్యామిలీ ట్వీట్లు వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News