Guntur Cheating Case: అతను ఓ మహిళతో వివాహేతర సబంధం పెట్టుకున్నాడు. ఆమె కళ్లలో ఆనందం కోసం ఏదైనా చేయాలని ప్లాన్ చేశాడు. ఆమె డబ్బులు ఇచ్చి సంతోష పరుద్దామని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ఆరుగాలం కష్టపడి పండించిన అన్నదాతల డబ్బుల కాజేయాలని స్కెచ్ వేశాడు. వారి వద్ద నుంచి పత్తి కొనుగోలు చేసి.. ఆ సొమ్ము చెల్లించకుండా దొంగలు ఎత్తుకెళ్లారంటూ డ్రామాలు ఆడి చివరికి జైలు పాలయ్యాడు. విచారణలో నిజాలు తెలుసుకుని పోలీసులే అవాక్కయ్యారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా..
తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన గంధం శ్రీను అనే వ్యక్తి గత పది సంవత్సరాలు రైతుల పత్తి కొనుగోలు చేస్తూ.. ఆ పత్తిని మిల్లులకు అమ్మి రైతులకు సొమ్మును చెల్లించేవాడు. ఆదాయం బాగా రావడంతో శ్రీను చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆమె కోసం ఏదో ఒకటి చేయాలని అనుకున్నాడు.
ఇటీవల కంతేరు గ్రామానికి చెందిన రైతుల వద్ద పత్తి కొనుగోలు చేసిన శ్రీను.. ఆ పత్తిని గుంటూరులోని కాటన్ మిల్లుకు అమ్మేశాడు. ఈ నెల 19న మిల్లు నుంచి 2 లక్షల నగదు తీసుకుని.. తిరిగి కాంతేరు గ్రామానికి వస్తూ దారిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ కొడుక్కి ఫోన్ చేశాడు. రాత్రి 7.40 గంటల సమయంలో అతనికి ఈ డబ్బులు ఇచ్చి పంపించేశాడు.
అనంతరం అక్కడే ఉన్న కాంక్రీట్ కుప్పలకు తన తలను బాదుకున్నాడు. తన డబ్బులు తీసుకువచ్చిన సంచి అక్కడే పాడేశాడు. ఎవరో దొంగలు తనను కొట్టి డబ్బులు ఎత్తుకెళ్లారని సీన్ క్రియేట్ చేసేందుకు తన ఫోన్‌ను కూడా పగలకొట్టుకున్నాడు. ఆ తరువాత బంధువులకు ఫోన్ చేసి.. తనను ఎవరో కొట్టి డబ్బులు లాక్కెరని చెప్పాడు. వారు వెంటనే అక్కడికి వచ్చి శ్రీనును హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులను కూడా నమ్మించేందుకు ముందుగానే తనకు తెలిసిన మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి చెప్పాడు.
శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. అయితే అతను తలబాదుకున్న ప్రదేశంలో ఎలాంటి దొంగతనం జరిగిన అనవాళ్లు కనిపించలేదు. శ్రీను పూర్తిస్థాయిలో విచారించగా.. అతను చెప్పే విషయాలకు, దొంగతనం జరిగిన తీరుకు పొంతన కుదరలేదు. దీంతో శ్రీనుపైనే పోలీసులకు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని గట్టిగా అడిగారు. దీంతో అసలు విషయం చెప్పేశాడు. శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసి.. అతని వద్ద 2 లక్షల నగదు, బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. రైతులను ముంచాలని ప్లాన్ వేసిన శ్రీను.. చివరికి అడ్డంగా బుక్ చివరికి జైలు పాలయ్యాడు.
Also Read: MLA Rohit Reddy: నన్ను అరెస్ట్ చేసినా.. బీజేపీకి లొంగను: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
Also Read: Ind Vs Ban: ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. ఏడాదిగా జట్టుతోనే తిరుగుతున్న యంగ్ క్రికెటర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook