Anam Ramnarayana Reddy Indirect Comments on Nedurumalli Ramkumar Reddy: ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తలనొప్పిగా మారుతున్నారు. జిల్లాల విభజనతోనే ఆయన తన అసమ్మతి స్వరాన్ని వినిపిస్తూ వస్తున్నారు, జిల్లాల విభజన సహేతుకంగా లేదని కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఆయన అప్పటి నుంచి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని ఇప్పుడు ఆయన టార్గెట్ చేస్తున్న పరిచయం కనిపిస్తోంది.
వాస్తవానికి 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ టికెట్ మీద అనేక చర్చలు జరిగాయి. వాస్తవానికి అక్కడ బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ముందు నుంచి ఎమ్మెల్యేగా నిలబడతానని ప్రచారం చేసుకుంటే చివరి నిమిషంలో అధిష్టానం రామనారాయణరెడ్డిని అక్కడికి పంపింది. ఆనం ఆత్మకూరు టికెట్ ఆశిస్తే దాన్ని ఇవ్వలేక వెంకటగిరి పంపించారు, టికెట్ దక్కకపోవడంతో బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి టిడిపిలోకి వెళ్లారు, అయితే వెంకటగిరి నుంచి రామ్ కుమార్ రెడ్డి కూడా టికెట్ ఆశించారు కానీ టికెట్ రాకపోవడంతో పాటు జగన్ సూచనలు మేరకు ఆనం రామనారాయణ రెడ్డికి గెలుపుకు కృషి చేశారు.
తర్వాత ఆయనకు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా పదవి వచ్చింది. ఆయన వర్గానికి చెందిన కొంత మంది స్థానిక నాయకులు కూడా జగన్ కీలక పదవులు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో తనదే టికెట్ అంటూ భావిస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటుంటే ఈసారి టికెట్ తనకే అన్నట్టుగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పై ఆనం పరోక్షంగా కామెంట్స్ చేశారు. అసలు నేను ఎమ్మెల్యేనా? లేదా కొత్తవారిని పెట్టారా? అని మా నాయకులు, కార్యకర్తలు అనుమానిస్తున్నారని ఆనం కామెంట్ చేశారు.
నియోజకవర్గంలో గడప గడపకు వెళ్తే ఎమ్మెల్యేకి టీ ఇచ్చామా ? లేదా దారిన పోయావాడికి ఇచ్చామా అని అనుకోవాలా ? అని ఆనం ప్రశ్నించారు. వెంకటగిరి ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొన్నారు, ఇప్పటి వరకు నేనే ఎమ్మెల్యేని అని పేర్కొన్న ఆయన ఇంకా సంవత్సరం రోజులు నేనే ఎమ్మెల్యేగా ఉంటానని కూడా ఆనం పేర్కొన్నారు. వెంకట గిరిలో సంవత్సరం తర్వాత వచ్చే పెద్దమనిషి ఇప్పుడే చెప్పుకున్నట్లు ఉన్నారని పేర్కొన్న ఆనం ఒకసారి పోటీకి వచ్చి సగం ఎలక్షన్ లో పారిపోయినటువంటి వ్యక్తి గురించి నన్ను అడిగితే ఎలా ? అంటూ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గురించి పరోక్షంగా కామెంట్ చేశారు.
ఇక ఆయన వచ్చి నేనే రేపు ఎమ్మెల్యేని, రేపు రాబోతున్నాను అంటున్నాడు, మరి ఇప్పుడు నేను ఎమ్మెల్యేని అవునా ? కాదా ? అంటూ ఆయన ప్రశ్నించారు. కొంత మంది వచ్చి ఆశపడుతుంటారు, ఈడు ఎప్పుడు కాళీ చేస్తాడా ? కుర్చీ లాక్కునేద్దామా అని ఎదురు చూస్తారని పేర్కొన్న ఆనం సంవత్సరం తర్వాత వచ్చే ఎన్నికలకు ఇప్పుడే ఎసరు పెడుతున్నారని కామెంట్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ అంశం మీద నేదురుమల్లి వర్గం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సి ఉంది.
Also Read: Vallabhaneni Janardhan Passed Away: వారం వ్యవధిలో మరో విషాదం.. టాలీవుడ్ సీనియర్ నటుడు జనార్దన్ మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook